• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు సరికాదు’

HYD: చంచల్ గూడ కేంద్ర కారగారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్‌ను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్, ఉప్పల వెంకటేష్ గుప్తా పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు సరికాదని, రాజకీయ కక్ష సాధింపుల కోసం కేసులు నమోదు చేయడం దురదృష్టకరమన్నారు. శ్రీకాంత్ పై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.

February 21, 2026 / 08:31 PM IST

టీజీవో డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

KNR: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా డైరీ-2026ను కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు కాళిచరణ్ ఆధ్వర్యంలో గెజిటెడ్ ఉద్యోగులు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. అసోసియేషన్ రూపొందించిన ఈ డైరీలో ఉద్యోగులకు అవసరమైన సమాచారం పొందుపరచడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.

February 21, 2026 / 08:30 PM IST

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

MDK: పదవ తరగతి పరీక్షలు పకడ్బందీ ప్రణాళికతో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించే అధికారులకు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరీక్ష కేంద్రానికి ప్రశ్న పత్రాలు తీసుకుపోయే సమయంలో జాగ్రత్త వాహించాలని సూచించారు.

February 21, 2026 / 08:30 PM IST

రాష్ట్రస్థాయి కరాటే పోటీలు

JGL: ధర్మపురిలో మార్చి 8 నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కుంగ్-పూ&కరాటే పోటీల పోస్టర్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల ప్రతిభ వెలికితీయడంలో ఇలాంటి పోటీలు కీలకమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

February 21, 2026 / 08:28 PM IST

బాధిత కుటుంబాలను పరామర్శించిన BJP నేతలు

BHPL: రేగొండ మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబ సభ్యులను శనివారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల కుటుంబానికి BJP అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో BJP ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

February 21, 2026 / 08:26 PM IST

వికారాబాద్‌కు చేరుకున్న వైఎస్ షర్మిల

VKB: వికారాబాద్‌లో వైసీసీ అధ్యక్షుడు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

February 21, 2026 / 08:26 PM IST

వివాహ వేడుకల్లో దారుణ హత్య

PDPL: రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ వద్ద శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకకు హాజరైన మొలుగూరి కొమురయ్య (58)ను గేటు ముందే గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 08:24 PM IST

కొనసాగుతున్న జలమండలి బస్తీబాట

HYD: నీటిని పొదుపుగా వాడుకోవడం అందరి బాధ్యత అని జలమండలి ఎండి అశోక్ రెడ్డి అన్నారు. జలమండలి బస్తిబాట కార్యక్రమంలో భాగంగా ఉప్పాలగూడలోని సెక్రటేరియట్ కాలనీ, శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కొంతమంది తాగునీటిని వృధా చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు నీటిని కాపాడుకునేందుకు వారి వంతు ప్రయత్నం చేయాలన్నారు.

February 21, 2026 / 08:24 PM IST

విషాదం.. యువకుడు సూసైడ్

NGKL: కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మార్చాలకు చెందిన సాయిప్రసాద్ (23) కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అతడు స్వగ్రామానికి వచ్చాడు. శనివారం గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 08:21 PM IST

పాలిటెక్నిక్ భవన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

WGL: నగరంలోని మున్నూరు కాపు భవన్ ప్రక్కన పాలిటెక్నిక్ భవన నిర్మాణ పనులను ఇవాళ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి నెహ్రూ ఆధ్వర్యంలో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల భవనం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రూ. 22 కోట్లతో నిధులు కేటాయించి నూతన భవనాలు ఏర్పాటు సంతోషంగా ఉండని ఆయన అన్నారు.

February 21, 2026 / 08:20 PM IST

గ్రామస్తులకు రూ. 50 వేలు అందజేసిన ఎమ్మెల్సీ

RR: కొందుర్గు మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో 25- 27వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామస్తులు ఆర్థిక సహాయం కోరగా వెంటనే స్పందించి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి MLC రూ. 50 వేలు అందజేశారు.దేవాలయాల అభివృద్ధికి సహాయ సహకారాలు ఉంటాయన్నారు.

February 21, 2026 / 08:20 PM IST

సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

HNK: నగరంలోని గిరిజన భవన్‌లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా సేవాలాల్ చిత్రపటం వద్ద MLA కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించారు.

February 21, 2026 / 08:17 PM IST

కుటుంబసభ్యులు మందలించారని యువకుడు ఆత్మహత్య

ASF: వాంకిడి మండలం బనార్కోసారలో కుటుంబ సభ్యులు మందలించారనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI మహేందర్ వివరాల ప్రకారం.. నాగేషే రవీందర్ మద్యానికి బానిసై పనికి వెళ్లకుండా తిరుగుతుండటంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన అతను ఇంట్లో చీరతో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 08:16 PM IST

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

NRPT: ఈనెల 25 నుంచి మార్చి 16 వరకు జరిగే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, ఎలాంటి తప్పులకు తావులేకుండా పరీక్షలు జరగాలని ఆమె ఆదేశించారు. మొదటి సంవత్సరం 4408 మంది, రెండో సంవత్సరం 3783 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.

February 21, 2026 / 08:15 PM IST

సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలి: కలెక్టర్

NGKL: జిల్లాలోని అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బిజినేపల్లి మండలం వట్టెం, రామిరెడ్డిపల్లిలో కొనసాగుతున్న మిషన్ భగీరథ తాగునీటి ఇంటింటి సర్వేను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.

February 21, 2026 / 08:15 PM IST