గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. నాలుగేళ్ల తర్వాత ఏప్రిల్ నెలలో హై పవర్ డిమాండ్ నెలకొంది. పొద్దంతా ఎండలు ఉండగా.. సాయంత్రం ఉక్కపోతతో ఏసీలు, కూలర్లు ఆన్ చేయడంతో పవర్ డిమాండ్ ఎక్కువ అవుతుంది.
యంగ్ బ్యూటీ శ్రీలీల(sreeleela) హైదరాబాద్లోని ఏయస్ రావ్ నగర్లో(as rao nagar) ప్రత్యక్షమైంది. ఓ ప్రముఖ సంస్థ జ్యూయలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైంది. దీంతో అభిమానులు షోరూం దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కేసీఆర్ ఫ్యామిలీ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్(kcr) పలు రకాల ప్లాన్స్ అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. తాజాగా విశాఖ ప్లాంట్ విషయంలో కూడా అదే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కూడా సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని ప్రజలను తప్పుదొవ పట్టించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
జూదం ఇది చాలా మందికి నియంత్రించలేని వ్యసనంగా ఉంటుంది. దీని బారిన పడిన వారు అంత ఈజీగా తప్పించుకోలేరు. ఇది ఒక రుగ్మత మాదిరిగా తయారై మనుషులను ఆర్థికంగా నాశనం చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్(hyderabad)కు చెందిన ఓ వ్యక్తి సైతం క్రెకిట్ బెట్టింగ్(cricket betting) బారిన పడి రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఫేక్ డాక్యుమెంట్లతో వృద్ధదంపతులను మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారికి న్యాయం జరిగేలా చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలోని రంగశాయపేట(rangashaipet warangal)లో ఇటీవల చోటుచేసుకుంది.
కరీంనగర్ జిల్లా(Karimnagar)లోని చెర్లబూట్కూర్ లో సభా వేదిక(Stage) కూలడంతో మంత్రి గంగుల కమలాకర్ సహా ఇతర నేతలు ఉన్న ఫళంగా కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి కమలాకర్ సురక్షితంగా బయటపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి.
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ సై అంటే సై అంటుండగా.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) కూడా కసరత్తు ప్రారంభించింది. ముగ్గురు సీనియర్ అధికారుల బృందం ‘తెలంగాణ ఎన్నికల’పై సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పంచాయతీ కార్యదర్శులు ప్రొబేషన్ పీరియడ్ ఈ నెల 11తో ముగిసిందని, గడువు ముగిసిన పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని వారు అన్నారు
ఈడీ వస్తుందంటే కాలు విరుగుతుంది, సీబీఐ(CBI) వస్తుందంటే దుబాయి వెళ్తారు, ఇలాంటి నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్( Warangal) లో జరిగిన నిరుద్యోగ మార్చ్ (Unemployment march) లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై పలు విమర్శలు గుప్పించారు.
కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున టింబర్ డిపో(Timber depo)లో మంటలు ఏర్పడి ముగ్గురు సజీవదహనమయ్యారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(Tspsc) కీలక ప్రకటన విడుదల చేసింది. పలు ఉద్యోగ నియామక పరీక్షల(Exams)కు కొత్త తేదీలను ప్రకటించింది.
ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలులో ఉంటూనే లేఖలతో ప్రకంపనలు రేపుతున్నాడు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాట్‌కు సంబంధించి లేఖ విడుదల చేయగా.. ఇప్పుడు మరో లేఖ బయటకు వచ్చింది.