JN: బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా వివిధ గ్రామాలకు నీరు అందించేందుకు గాను కాలువల్లో పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులను నేడు జనగామ గ్రంథాలయ ఛైర్మన్ రాంబాబు ప్రారంభించారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఛైర్మన్ అన్నారు.
KNR: గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులు కీలకపాత్ర పోషించాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శుక్రవారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో స్థానిక సర్పంచులకు ట్రైనింగ్ జరిగింది. పంచాయతీ రాజ్ చట్టంపై సర్పంచులు అవగాహన కలిగి ఉండాలన్నారు. సంక్షేమ పథకాలతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.
RR: కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర సందర్భంగా వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం తరలివస్తున్నారు. ఈ సందర్భంగా లే మామిడి గ్రామానికి చెందిన పలువురు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
NGKL: జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారిని అవమానించిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని మిత్రమండలి వెల్దండ ఎస్సై కురుమూర్తికి ఫిర్యాదు చేసింది. అజిలాపూర్ గ్రామానికి చెందిన సిద్దమోని రమేష్ గౌడ్, బుచ్చిబాబులపై చట్టపరమైన చర్యలు కోరారు. మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు మట్ట పరమేష్ గౌడ్, యాదగిరి, శివ, రాజు తదితరులు వినతిపత్రం అందజేశారు.
MDK: రేగోడ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న DEO విజయ వెంటనే పాఠశాలను సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సహకారంతో విద్యార్థులకు తగిన చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
SRD: అనంతారంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని సర్పంచ్ కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు రూ.20 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణం ప్రారంభించారు. గ్రామంలో సీసీ రోడ్లకు రూ.10 లక్షలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
NZB: పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు (CS), డిపార్ట్మెంటల్ అధికారులదే(DO) ముఖ్య పాత్ర అని జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) రవికుమార్ అన్నారు. శుక్రవారం ఖిల్లా జూనియర్ కళాశాలలో CS, DOలతో నిర్వహించిన సమీక్షలో DIEO మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.
SDPT: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ సమంజసం కాదని ఉప సర్పంచ్‌ల ఫోరం బెజ్జంకి మండల అధ్యక్షుడు దీటి బాలనర్సు అన్నారు. రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేసి దూర ప్రాంత జైలుకు తరలించారని ఆరోపించారు. క్యాతన్‌పల్లి ఛైర్మన్ ఎన్నికను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని విమర్శించారు. ప్రజా తీర్పును గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు.
PDPL: బీహార్‌లోని బసంత్ పూర్‌కు చెందిన లాల్ కృష్ణ అనే యువకుడు 8 నెలల క్రితం దేశంలోని వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు సైకిల్ యాత్ర ప్రారంభించాడు. ఇవాళ ఆయన సైకిల్ యాత్రతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం చేరుకున్నాడు. వీలైన ప్రదేశాలలో సేద తీరుతూ, ప్రతిరోజు 100 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు తెలిపాడు.
NLG: చిట్యాల పట్టణంలోని లొయోల టెక్నో స్కూల్‌లో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా మున్సిపాల్ ఛైర్మన్ పందిరి గీత రమేష్, ఎస్సై రవికుమార్‌లు పాల్గొన్నారు. పాఠశాలలో ‘మాక్ కోర్ట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో తాత్కాలిక కోర్టు రూం వాతావరణాన్ని ఏర్పరిచారు.
KMM: ధ్యానం శారీరక, మానసిక ప్రశాంతతకు, ఆనందానికి తోడ్పడుతుందని మధిర మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ సామినేని సుజాత అన్నారు. శుక్రవారం మాటూరుపేట గ్రామంలో నరసింహా పిరమిడ్ కేంద్రం వద్ద వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిరమిడ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ధ్యానాన్ని గ్రామ సర్పంచ్ చిలువేరు పూర్ణమ్మ బుచ్చిరామయ్యతో కలిసి ప్రారంభించి ప్రసంగించారు.
MBNR: క్రీడలు శారీరకదృఢత్వంతో పాటు మానసికస్థైర్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం కప్ పోటీలను ఎమ్మెల్యే జ్యోతివెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధ్యాణ్యత ఇస్తుందన్నారు. యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి PHC సిబ్బంది మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ దీపిక ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హెల్త్ సూపర్వైజర్ సుభాష్, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
KNR: ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ ఇంగిలే రామారావు, ఈవో సుధాకర్ తెలిపారు. పందిళ్లు, క్యూలైన్లు, విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ టీవీలు, అన్నదాన సామగ్రి, పెయింటింగ్ వంటి పనులకు ఆసక్తి గలవారు రూ.500 చెల్లించి, ఈ నెల 24న ఉదయం 11 గంటలలోపు కొటేషన్లు సమర్పించాలని వెల్లడించారు.
NLG: మునుగోడు గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీదేవి గూడెంకు చెందిన రేషన్ డీలర్ ఉడుత సైదులు సోదరుని వివాహ వేడుక ఇవాళ చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలోని రిక్కల సత్తిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.