• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ

MDK: జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు వార్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ వర్క్ షాప్ నిర్వహించారు. వర్క్ షాప్‌కు సంబంధించి నేతలకు, కార్యకర్తలకు తగు సూచనలను చేశారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన నర్సాపూర్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ భూచేష్ యాదవ్, కౌన్సిలర్లు శంకర్ గౌడ్, శ్రీకాంత్ నిరంజన్ దాస్‌ను సన్మానించారు.

February 22, 2026 / 08:03 AM IST

ఈ నెల 24న జిల్లాలో జాబ్ మేళా

NLG: నిరుద్యోగ యువతీ, యువకుల కోసం వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిని పద్మ తెలిపారు. ఎంపికైన వారు నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుందని, నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు. టెన్త్-డిగ్రీ వారు అర్హులని వెల్లడించారు.

February 22, 2026 / 08:01 AM IST

తాళం వేసిన ఇంట్లో చోరీ..!

MNCL: భీమారం మండలం నర్సింగాపూర్‌లో దొంగతనం జరిగింది. SI రాజేందర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుంటి సత్తయ్య కుటుంబ సభ్యులతో కలిసి శనివారం వివాహానికి వెళ్లాడు. తిరిగి రాత్రి వచ్చి చూసేసరికి ఇంటి తాళం, బీరువా పగులగొట్టి ఉన్నాయి. సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

February 22, 2026 / 07:55 AM IST

ఈ నెల 27తో ముగియనున్న పత్తి కొనుగోళ్లు

ASF: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నిబంధనల ప్రకారం 2025-26 సీజన్‌కు సంబంధించి మద్దతు ధర (MSP) వద్ద పత్తి కొనుగోలు ప్రక్రియ ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. ఈ మేరకు మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులు ఈ కొద్ది రోజులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

February 22, 2026 / 07:53 AM IST

పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం

ASF: కాగజ్ నగర్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా కాల్చడంతో అందులోంచి వచ్చిన మినుగురులు వరుడి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన టెంటుపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని టెంటు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

February 22, 2026 / 07:51 AM IST

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ

SDPT: కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గడ్డం కృష్ణయ్య, ఎంపీవో రవీందర్ రెడ్డి మండలంలోని వార్డు సభ్యులకు శిక్షణ సదస్సు నిర్వహించారు. ఐదు రోజులపాటు జరిగిన శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. అధికారులు బాలాజీ, కుమార్, మాధవి అందించగా.. శిక్షణ పూర్తి చేసిన వార్డ్ సభ్యులకు గ్రామ కార్యదర్శి మాధురి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలను అందజేసి అభినందించారు.

February 22, 2026 / 07:51 AM IST

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా డైరెక్టర్ జగన్మోహన్ కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆదివారం లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.

February 22, 2026 / 07:50 AM IST

గల్ఫ్ కార్మికులకు ఆసరా.. హెల్ప్ లైన్ నంబర్ విడుదల..!

NRML: గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న జిల్లా కార్మికుల కోసం కలెక్టరేట్లో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుకలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ కేంద్రం నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. విదేశాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు 93984 21883 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని ఆమె సూచించారు.

February 22, 2026 / 07:49 AM IST

ఆ ప్రమాదం జరిగి నేటికి ఏడాది..!

NLG: జిల్లా ప్రజలకు సాగు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టు పనులు అవాంతరాల మధ్య కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి సొరంగ మార్గంలో ప్రమాదం జరిగి నేటికీ ఏడాది అయ్యింది. ఈ ప్రాజెక్టు 20 ఏళ్లుగా నిర్మాణంలో ఉంది. 43 కిలోమీటర్ల సొరంగ మార్గానికి గాను ఇంకా 9 కి.మీ పనులు జరగాల్సి ఉంది.

February 22, 2026 / 07:47 AM IST

మాతృభాషపై అభిమానం చాటుకున్న విద్యార్థులు

JGL: మల్లాపూర్ మండలం మొగిలిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు శనివారం మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘అ’ ఆకారంలో కూర్చొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి ఒక్కరు మాతృభాషకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి నేర్చుకోవాలని, మాతృభాష అమ్మ లాంటిదని విద్యార్థులు నినదించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వేముల శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 22, 2026 / 07:46 AM IST

నకిలీ పురుగు మందు.. రూ.8 లక్షల స్టాక్ సీజ్..!

SRPT: మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెం గ్రామంలో భారీగా నకిలీ పురుగుమందు విక్రయం బట్టబయలైంది. ప్రముఖ కంపెనీ ‘Bayer Nativo’ పేరుతో నకిలీ మందులు అమ్ముతున్నారన్న సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు డీలర్ షాపులు, గౌడౌన్‌లపై శనివారం సాయంత్రం మెరుపు దాడులు చేశారు. రూ.3 లక్షల విలువైన నకిలీ ప్యాకెట్లు, పౌడర్‌తో పాటు రూ.8 లక్షల విలువైన పెస్టిసైడ్స్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు.

February 22, 2026 / 07:45 AM IST

లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

SRPT: మునగాల మండలం రేపాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల గోడపత్రికను కాంగ్రెస్ పార్టీ మునగాల మండల అధ్యక్షుడు జయపాల్ రెడ్డి మునగాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.

February 22, 2026 / 07:43 AM IST

కత్తితో పొడిచి చంపారు.. తల్లీకొడుకుల అరెస్ట్

SDPT: దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో జరిగిన హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు మృతుడు వంగ బాల్రెడ్డి (61)ని శుక్రవారం కత్తితో పొడిచి హత్య చేసినట్లు సీఐ రాజేశ్ తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ వివాదంపై పాత విభేదాలు కొనసాగుతుండగా, వంగ రేణుక (55), ఆమె కుమారుడు సోమేశ్వర్ (26) కలిసి బాల్ రెడ్డిని హత్య చేశారని తెలిపారు.

February 22, 2026 / 07:42 AM IST

గ్రామం నుంచి ALL INDIA పోటీలకు

SDPT: రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన పి.సతీశ్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ కాలేజ్ నెట్‌బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు మార్చి 9 నుంచి 13 వరకు సేజ్ యూనివర్సిటీ మధ్య ప్రదేశ్‌లో జరగనున్నాయి.

February 22, 2026 / 07:40 AM IST

జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

VKB: జిల్లాలో ఈరోజు చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 280-320 వరకు విక్రయిస్తుండగా, స్కిన్‌లెస్ చికెన్ రూ.320కు పైగా ఉంది. డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం వల్లే ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

February 22, 2026 / 07:34 AM IST