• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యం

MDCL: మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం తన లక్ష్యమని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. వివిధ అభివృద్ధి పనులు సమస్యలను పరిష్కరించాలని కోరారు.

February 23, 2026 / 04:29 PM IST

ప్రజావాణి అర్జీలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి మొత్తం 44 దరఖాస్తులు స్వీకరించారు. భూమి, పెన్షన్లు, ఇతర సమస్యలపై వచ్చిన అర్జీలను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్‌మెంట్ చేసి ఆదేశించారు.

February 23, 2026 / 04:27 PM IST

వార్డు మెంబర్లకు రెండవ విడత శిక్షణ ప్రారంభం

NLG: చిట్యాల మండలంలోని జీపీ వార్డు సభ్యులకు రెండవ విడత శిక్షణా తరగతులు గుండ్రాంపల్లి రైతు వేదికలో ఇవాళ ప్రారంభమయ్యాయి. 20వ వరకు జరిగే శిక్షణకు ఆరెగూడెం, గుడ్రాంపల్లి, సుంకేనేపల్లి, వెలిమినేడు, ఏపూరు, బొంగోనిచెరువు, పిట్టంపల్లి, పేరేపల్లి, పెద్దకాపర్తికి చెందిన 90 మంది వార్డు సభ్యులు హాజరయ్యారు. ఎంపీడీవో జయలక్ష్మి, ఎంపీవో కోటేష్,యూసుఫ్ పాల్గొన్నారు.

February 23, 2026 / 04:25 PM IST

‘అక్రమ అరెస్ట్‌ల మీద ఉన్న శ్రద్ధ.. అభివృద్ధి మీద లేదు’

MNCL: క్యాతనపల్లిలో BRS-CPI పొత్తుతో 14 మంది కౌన్సిలర్లు గెలిచినప్పటికీ 7 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో ఛైర్మన్ పీఠం కోసం మంత్రి వివేక్ అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని TBGKS నాయకులు ఆరోపించారు. సోమవారం మందమర్రిలో మాట్లాడారు. మంత్రి వివేక్‌కు అక్రమ అరెస్ట్‌ల మీద ఉన్న శ్రద్ధ, అభివృద్ధి మీద లేదని, పోలీసుల వెనుక దాక్కుని రాజకీయం చేయడం మానుకోవాలన్నారు.

February 23, 2026 / 04:25 PM IST

‘మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని’

హన్మకొండ నగరంలోని ఎస్ టీ పీటర్స్ ఫార్మసీ కళాశాలలో సోమవారం జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుబేదారి ఎస్సై ఫణి హాజరై యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే 8712584473కు తెలియజేయాలని, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్‌ను వినియోగించాలని సూచించారు.

February 23, 2026 / 04:25 PM IST

‘నిద్రమాను వృక్షాల నరికివేతపై చర్యలు చేపట్టాలి’

BDK: మణుగూరు ఏరియాలో నిద్రమాను వృక్షాల నరికివేతపై అటవీ శాఖ జిల్లా ఫారెస్ట్ ఏవో కే.ఎస్.ఎన్ మూర్తికి సామాజిక సేవకులు కర్నే బాబురావు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సుమారు యాభై సంవత్సరాలు వయసున్న నిద్రమాను చెట్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా నరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

February 23, 2026 / 04:25 PM IST

స్వగ్రామానికి చేరిన మృతదేహం

NZB: నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన పస్క రాజు పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లగా గుండె పోటుతో మరణించారు. పది రోజుల తర్వాత రాజు మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరింది. రాజు కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకునేలా చూస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు. గల్ఫ్‌లో ఉన్న మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చిన NRIలకు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

February 23, 2026 / 04:24 PM IST

పోలీస్ క్రీడాకారులను అభినందించిన సీపీ

PDPL: క్రీడలలో ప్రతిభ సాధించిన పోలీస్ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్- 2026లో పాల్గొని బహుమతులు సాధించిన పోలీసులను సోమవారం కమిషనరేట్లో అభినందించారు. విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్రీడలలో రాణించడం గర్వకారణం అన్నారు.

February 23, 2026 / 04:20 PM IST

‘రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ’

NRML: రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని ఏఎస్పీ సాయికిరణ్ అన్నారు. అరైవ్ అలైన్ రెండవ దశ కార్యక్రమంలో భాగంగా సోమవారం మామడ మండలంలోని లింగాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు.

February 23, 2026 / 04:19 PM IST

నూతల వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

WGL: గ్రేటర్ WGL మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు దామెర్పుల స్వరూప-సాంబయ్య దంపతుల కుమారుడు అనిల్ కుమార్-శ్రావణి వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే KR నాగరాజు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వధూవరులకు బహుమతి అందజేశారు.

February 23, 2026 / 04:17 PM IST

పాదయాత్రకు షాద్ నగర్ న్యాయవాదుల సంఘీభావం

RR: న్యాయవాదులపై దాడులను అరికట్టాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని న్యాయవాదులందరూ సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ న్యాయవాద బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో న్యాయవాద బార్ అసోసియేషన్ సభ్యులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. న్యాయవాద రక్షణ చట్టం అమలు చేయాలని తెలిపారు.

February 23, 2026 / 04:16 PM IST

ALERT: నీటి సరఫరాలో అంతరాయం

ఆసిఫాబాద్ మండలం మాణిక్ వాడలోని 115 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారి రాకేశ్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, సిర్పూర్ (టీ), బెల్లంపల్లి ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. పనులు పూర్తి కాగానే సరఫరా పునరుద్ధరిస్తామనన్నారు.

February 23, 2026 / 04:14 PM IST

‘రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది’

జనగామ: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు అన్నారు. నాగర్ కర్నూల్ ఘటనను నిరసిస్తూ.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, జఫర్గడ్ ఎమ్మార్వోకు సోమవారం వినతిపత్రం అందించారు. బాధితులపై చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తూ, కాంగ్రెస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతుని మండిపడ్డారు.

February 23, 2026 / 04:13 PM IST

రైల్వే పెన్షనర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక

హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పీ. సాంబమూర్తి, ప్రధాన కార్యదర్శిగా మండలోజు కృష్ణమూర్తి, కోశాధికారిగాక ఐలయ్య, ఉపాధ్యక్షులుగా హసన్ పాషా జీ. వెంకటనారాయణ ఎంపికయ్యారు.

February 23, 2026 / 04:12 PM IST

‘మహిళా కాంగ్రెస్ బలోపేతమే పార్టీ లక్ష్యం’

MLG: మహిళా కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా జిల్లాలోని అన్ని మండలాలకు మహిళా కాంగ్రెస్ ఇంఛార్జీలను ప్రకటించారు. మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి ఈ ప్రకటన చేశారు. మండల ఇంఛార్జీలు గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేస్తామన్నారు.

February 23, 2026 / 04:11 PM IST