BHNG: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి, వారికి ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు తెలిపారు. ఆదివారం ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలను రాయాలని రాజు సూచించారు.
NZB: కమ్మర్‌పల్లి మండలంలోని కేసీఆర్ కాలనీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రోళ్ల లస్మయ్య (75) మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. లస్మయ్య ఎకైల్పై కమ్మర్ పల్లి నుంచి వెళ్తుండగా జాతీయ రహదారి-63పై అతని వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లస్మయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఎస్సై అనిల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
JGL: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి తిరిగి యథాతథంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
NLG: చిట్యాల మున్సిపల్ చైర్మన్‌గా పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్‌గా గుండెబోయిన శ్రీలక్ష్మి ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ జిట్ట నగేష్, సీపీఎం జిల్లా నేత అవిశెట్టి శంకరయ్య వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సుధాకర్ రెడ్డి, రాజయ్య, యాదయ్య, అర్జున్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
ASF: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి మార్చి 16 వరకు జరగనున్నాయి. జిల్లా గతంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో ఈసారి కూడా మెరుగైన ఫలితాల లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు DIEO రాందాస్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పూర్తి సన్నద్ధతతో పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.
గద్వాల పట్టణంలోని అనంత ఫంక్షన్ హాల్లో సోమవారం ‘రైతు సంఘర్షణ సభ’ జరగనుంది. ఈ సభకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలపై చర్చించనున్నారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని జిల్లా ఛైర్మన్ రంజిత్ కుమార్ కోరారు.
SRCL: కోనరావుపేట (M) బావుసాయిపేట గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ భద్రత కోసం ఆదివారం ఉపసర్పంచ్ తిక్కల నవీన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గౌడ కుల పెద్దల సమక్షంలో వీటిని ప్రారంభించి, ఆలయానికి అప్పగించారు. భక్తుల భద్రతను పర్యవేక్షించడంతో పాటు ఆలయ పరిసరాలను సురక్షితంగా ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశమని నవీన్ తెలిపారు.
కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడిగా మీర్ ఇమ్రాన్ అలీ, ఉపాధ్యక్షుడిగా వెంక గౌడ్, జనరల్ సెక్రటరీగా కోశాధికారిగా వెంకట్ ఎన్నికయ్యారు. సలహాదారులుగా షామయ్య, బలరాంలను ఎంపిక చేశారు.
ADB: బోథ్ మండలంలోని కూచులాపూర్ గ్రామంలో వీధి కుక్కల బీభత్సంతో పలు పశువుల మృత్యు బారిన పడుతున్నాయి. ఆదివారం గ్రామంలోని లస్మన్నకు చెందిన ఆవు దూడపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. అంతకు ముందు పలు మేకలు కుక్కల బారిన పడ్డాయి.
SRD: ప్రతి ఒక్కరికి దైవచింతన ఉండాలని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ తాబేలు గుట్టలో నూతన శ్రీ జీవన జ్యోతిర్లింగ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గుమ్మడిదల బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధికి రూ.1,51,000 విరాళం అందజేశారు. దైవానుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు.
PDPL: అనివార్య కారణాల వల్ల చదువు మధ్యలో మానేసిన వారికి ఆదివారం ధర్మారం కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఓపెన్ టెన్త్, ఇంటర్ బేస్ లైన్ పరీక్షలు నిర్వహించినట్లు కోఆర్డినేటర్ వడ్లూరి కిరణ్ తెలిపారు. చివరి పరీక్షలు ఏప్రిల్లో పెద్దపల్లిలో నిర్వహించబడతాయని ఆయన పేర్కొన్నారు. అందుకోసం విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
BDK: నిర్మాణంలో నాణ్యత పాటించాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే పాయం ఆదేశించారు. పినపాక మండలంలోని పోతిరెడ్డిపల్లి క్రింది గుంపు వాగుపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. సుమారు రూ. 65 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు.
MHBD: కోటగుళ్ళు శిల్ప సంపద అద్భుతమని ఇంగ్లాండ్ దేశానికి చెందిన సిమన్, వాలేరీలు అన్నారు. ఆదివారం ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను చరిత్రను రామప్ప గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ఫోటోలు, వీడియలు తీసుకున్నారు.
BDK: కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేపు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని క్యాంప్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటించారు. కొత్తగూడెం, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కూనంనేని అందజేస్తారని అన్నారు. అందరూ సకాలంలో హాజరు కావాలన్నారు.
HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 61 డివిజన్ చైతన్యపురి కాలనీలో తెలంగాణ రాజ్య అధికార పార్టీ లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆదివారం చేరారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వ్యక్తులకు నగరాధ్యక్షుడు అయినవోలు మల్లికార్జున శాస్త్రి కండువాలు కప్పి ఆహ్వానించారు.