• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఇందిరమ్మ గృహంతో నెరవేరిన కల

BHNG: రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో మమత గణేష్ దంపతుల ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, నకిరేకల్ నియోజకవర్గానికి తొలి విడతగా 3,500 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 02:11 PM IST

‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవార్డు’కు ఎంపిక

NLG: కనగల్ చెందిన సామాజిక సేవకురాలు డా. కంబాల శివలీల ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవార్డు-2026’కు ఎంపికయ్యారు. గత 12 ఏళ్లుగా ఆమె చేస్తున్న సామాజిక సేవలను గుర్తిస్తూ వాజ్‌పేయి-అద్వాని సేవా సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 22న ఉయ్యాలవాడ వర్ధంతి సందర్భంగా ఆన్‌లైన్ ద్వారా ఈ అవార్డును అందజేయనున్నారు. సంస్థ వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 02:11 PM IST

‘అభివృద్ధిపై చర్చకు సిద్ధం’

SRCL: వేములవాడ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ నేతలు నిమ్మశెట్టి విజయ్, కందుల క్రాంతికుమార్, వెంగళ శ్రీకాంత్ గౌడ్ సవాల్ విసిరారు. వేములవాడలో వారు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. వేములవాడలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ లక్ష్మీనరసింహారావుపై ఆరోపణలు చేస్తే ఊరుకోమని అన్నారు.

February 20, 2026 / 02:07 PM IST

సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

WGL: లంబాడ బంజారా ఆధ్యాత్మిక గురువైన సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు బంజారా జేఏసీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు, నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:06 PM IST

భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. హిందూ సాంప్రదాయం ప్రకారం.. మంచి రోజులు ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తరించారు. ప్రధానంగా చిన్నారుల పుట్టు వెంట్రుకలు, ఇతర శుభ కార్యాల సందర్భంగా రద్దీ ఏర్పడింది. భీమేశ్వరాలయంలో అభిషేకం, అన్న పూల్లో పాల్గొన్నారు.

February 20, 2026 / 02:05 PM IST

నగరంలో ఈనెల 24న నీటి సరఫరా బంద్

KNR: కరీంనగర్ నగరంలోని ఫిల్టర్ బెడ్ వద్దగల 14 MLD సామర్థ్యంగల నీటి సరఫరా వాల్వ్ మరమ్మతుల కారణంగా ఈనెల 24వ తేదీ (మంగళవారం)న నగరం అంతటా తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అలాగే నీటిని పొదుపుగా వాడుకోవాలని, నగరపాలక సంస్థకు సహకరించాలన్నారు.

February 20, 2026 / 02:05 PM IST

బాసర గోదావరిలో గుర్తు తెలియని మహిళ మృతి

NZB: నవీపేట్ మండల పరిధిలోని బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నవీపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

February 20, 2026 / 02:02 PM IST

అంగన్వాడీలో అన్నప్రాసన కార్యక్రమం

MNCL: బెల్లంపల్లి పట్టణం 31వ వార్డులో శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండారి స్రవంతి పాల్గొని చిన్న పిల్లలకు అన్నప్రాసన, గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లు, బాలామృతం పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరి, సహాయకులు సునీత, బస్తీ వాసులు పాల్గొనారు.

February 20, 2026 / 02:01 PM IST

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: గణేష్ రెడ్డి

ADB: అర్హులైన ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించటం జరుగుతుందని తలమడుగు మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి అన్నారు. దేవాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు మేలు చేపడుతుందని పేర్కొన్నారు.

February 20, 2026 / 02:01 PM IST

కళాశాలకు చేరిన ఇంటర్ హాల్ టికెట్స్..!

SRPT: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టిక్కెట్లు కళాశాల లాగిన్‌లోకి చేరాయని నడిగూడెం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ నాయక్ తెలిపారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ పరీక్షలు ముగియడంతో, విద్యార్థులు వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.

February 20, 2026 / 02:01 PM IST

నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: కమిషనర్

MNCL: మురుగు కాలువ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి సూచించారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 13వ వార్డు కాల్ టెక్స్ ఏరియాలో జరుగుతున్న కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. వార్డులోని అన్ని వీధుల్లో కల్వర్టులను త్వరగా నిర్మించాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కౌన్సిలర్ రాజ్ కుమార్, బస్తీవాసులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:01 PM IST

ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సందర్శించిన వైద్యులు

BDK: మణుగూరు మండలం అశోక్ నగర్‌లో చేపట్టిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని వైద్యులు పుల్లారెడ్డి సందర్శించారు. మన ఇంటి పరిసరాల్లో దోమలు పుట్టకుండా అవి పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పుల్లారెడ్డి, సునీల్ తెలిపారు. అనంతరం హాస్టల్ లోని కిచెన్, స్టాక్ రూమ్‌లను పరిశీలించి తగు సూచనలు చేశారు.

February 20, 2026 / 02:01 PM IST

నేత్రదానంతో ఇద్దరి జీవితంలో వెలుగులు

MNCL: బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంపు బస్తిలో శుక్రవారం మరణించిన చెందిన విశ్రాంత సింగరేణి ఉద్యోగి బింగి అశోక్ కుమార్ కళ్ళను జానహిత సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్‌వీ ప్రసాద్‌ హైదరాబాద్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు దానం చేశారు. మృతి చెందినా ఇతరులకు కంటి చూపు అందించి వారికి వెలుగును అందించడానికి నేత్రదానం చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

February 20, 2026 / 02:01 PM IST

BC సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా అజయ్

SRCL: బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర కార్య దర్శిగా కొప్పుల అజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ పట్టణానికి చెందిన కొప్పుల అజయ్ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం కార్యదర్శిగా నియమితులు కావడం పట్ల స్థానిక బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 20, 2026 / 02:01 PM IST

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుడదు: ఎమ్మెల్యే

RR: ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. SDNR మున్సిపల్ ఛైర్మన్‌గా బస్వం పదవి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మాట్లాడుతూ.. వార్డుల వారిగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు.

February 20, 2026 / 02:00 PM IST