MLG: గోదావరి జలాలకు సంబంధించిన వివాదం గత కొంతకాలంగా రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారిందని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కన్నయ్యగూడెం మండల కేంద్రంలోని దేవాదుల ప్రాజెక్టు వద్ద నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 10 ఏళ్లు పాలించిన ప్రభుత్వం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఉంటే రైతులకు ఇబ్బందులు రాకుండా ఉండేదని CM విమర్శించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రసాయన పరిశ్రమలు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. చౌటుప్పల్, పోచంపల్లి మండలాల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కాలుష్యంతో ఇప్పటికే నరకం చూస్తున్న జనం, ఇప్పుడు ఈ పేలుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో సుమారు 150 వరకు రసాయన పరిశ్రమలు ఉన్నాయి.
ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికైన డాక్టర్ అనిత రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆదివారం తెలిపారు. శ్రామిక ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తున్న అనిత బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 28వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన అనిత ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తానన్నారు.
SRPT: నేరేడుచర్ల మండలం బూరుగుల తండా గ్రామంలో గిరిజన ఆరాధ్యదైవం శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ గారి ఆదర్శాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ కొనతం చిన్న వెంకటరెడ్డి సర్పంచ్ నాగు ,ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.
KMM: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఏదులాపురం సత్య నారాయణపురంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడి గృహప్రవేశ వేడుకకు ఆదివారం మంత్రి హాజరయ్యారు. నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
NZB: నిజామాబాద్ గాయత్రినగర్‌లో ఆదివారం శ్రీ గాయత్రి చైతన్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ సుమిత్రను ఘనంగా సన్మానించారు. కమిటీ అధ్యక్షుడు ఆడెపు నరేంద్ర స్వామి మాట్లాడుతూ.. కార్పొరేటర్ సుమిత్ర కిషోర్ గతంలో చేసిన అభివృద్ధి పనులు, ఆయన మంచితనం వల్లే నేడు మళ్లీ విజయం చేకూర్చాయని అన్నారు.
MBNR: మిడ్జిల్ మండలం మల్లాపూర్‌కు చెందిన నందినికి రూ.32 వేల సీఎం సహాయ నిధి (CMRF) చెక్‌ను మాజీ సర్పంచ్ అయ్యన్న గౌడ్ అందజేశారు. సీఎంఆర్ఎఫ్ ఆపద సమయంలో పేదలకు భరోసాగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుకుమార్ రెడ్డి, చందర్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.
RR: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్‌లో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం MLA మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారాలతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బంజారా సంస్కృతిని రక్షించి, మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేశారన్నారు.
KMM: ఉమ్మడి ఖమ్మంలో గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఆరో తరగతి బ్యాక్లాగ్ పోస్టుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ప్రిన్సిపల్ కనకదుర్గ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 480 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 453 మంది పరీక్షకు హాజరైనట్లు మొత్తంగా 94.3 శాతం హాజరు నమోదైనట్లు ఆమె వివరించారు.
NRPT: మక్తల్ మండలం మంథన్‌గోడ్ సంగంబండ కాలువపై వంతెన లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో నీరు పారుతున్న సమయంలో పొలాలకు వెళ్లేందుకు కిలోమీటరు దూరం చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. రవాణా, వ్యవసాయ పనులు అంతరాయం కలుగుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కాలువపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
WNP: రాజకీయ స్వార్థం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకోబోమని బీసీ పొలిటికల్ జేఏసీ పట్టణ అధ్యక్షుడు శివ హెచ్చరించారు. చీర్ల చందర్ ని అవమానించేలా మాట్లాడటంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.ఆధారాలు లేకుండా బురదజల్లడం మానుకోవాలని, బీసీల ఐక్యతకు భంగం కలిగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా బీసీ నాయకులు పలువురు నిరసన వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 1:00 వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణి కి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రజావాణి ప్రజలు సద్వినియోగం పట్టుకోవాలని కోరారు.
NLG: పెద్దవూర మండలం కోమటికుంట తండాలో ప్రభుత్వ భూమిలోని విలువైన చెట్లను అక్రమార్కులు యథేచ్ఛగా నరికివేస్తున్నారు. వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వాల్టా చట్టం నిబంధనలు తుంగలో తొక్కిన వీరిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల ప్రమేయంతోనే చెట్లు నరుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
MHBD: గూడూరు మండలంలోని రాళ్లవాగు బ్రిడ్జి సమీపంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున స్థానికులు అటువైపు వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. JCB సహాయంతో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసి ఉన్న ప్రదేశం కనిపించడంతో వారు అవాక్కయ్యారు.
ADB: తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమంలో బోథ్ MLA అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు ప్రసాదాలు స్వీకరించారు. ఆలయాభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.