సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో ఆపదలో ఉన్న కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి శనివారం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 243 మందికి రూ.2.44 కోట్ల మేర ఆర్థిక సాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ATP: రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు రూ. 45.85 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైంది. ఇందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 36 మందికి రూ. 36.60 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. శనివారం రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
NDL: డోన్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ‘జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్’ థీమ్‌తో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పాల్గొని పరిశుభ్రత పనులను పరిశీలించారు. చెత్త వర్గీకరణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పరిశుభ్రమైన వాతావరణంపై అవగాహన పెంపు అవసరమని సూచించారు.
KKD: పేద ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారం అన్న క్యాంటీన్లలో అందజేయాలని కాకినాడ అదనపు కమిషనర్ సుధాకర్ సూచించారు. శనివారం ఆయన వివేకానంద పార్క్, రమణయ్య పేటలోని అన్న క్యాంటీన్లను తనిఖీ చేశారు. ఆహారాన్ని రుచి చూసి అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడారు. భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
AP: హిందువులకు మాజీ సీఎం జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. చెప్పులు వేసుకుని స్వామివారి ఫొటోలు పట్టుకున్నారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్‌లో ఇదంతా జరిగిందని తెలిపారు. హిందూ ధర్మంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ నేతలకు లీగల్ నోటీసులు ఇస్తామన్నారు.
GNTR: గుంటూరు నగరాన్ని వ్యర్థాల నిర్వహణలో ఆదర్శంగా నిలిపి “జీరో లిట్టర్” నగరంగా తీర్చిదిద్దుతామని గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం ఉద్యోగ నగర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ కంపోస్ట్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. డంపింగ్ యార్డులపై భారం తగ్గించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు
ప్రకాశం: త్వరలో విడుదల కానున్న డీఎస్సీ నోటిఫికేషన్‌లో ప్రకాశం జిల్లాకు అధిక సంఖ్యలో పోస్టులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కోరారు. శనివారం ఈ మేరకు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు.
TG: క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఛైర్మన్ సీటు వివాదం ముదురుతోంది. మంత్రి వివేక్ కారుపై దాడి కేసులో బాల్క సుమన్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. BRS కౌన్సిలర్ భూమయ్య గౌడ్ అక్రమంగా ప్రహరీ గోడ నిర్మించారని.. అధికారులు కూల్చేసేందుకు రావడంతో.. ఉద్రిక్తత మరింత పెరిగింది. మంత్రి వివేక్ నీచ రాజకీయాలు చేస్తున్నారని BRS నేతలు ఆరోపిస్తున్నారు.
BHPL: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన స్పీకర్‌కు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘన స్వాగతం పలికి ఆలయ విశిష్టతను, ఆలయ పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా: డోకిపర్రు గ్రామ పరిధిలోని జడ్పీ హైస్కూల్‌లో శనివారం విద్యార్థులకు చట్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత, బాల బాలికల రక్షణ, పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, మత్తు పదార్థాల వ్యతిరేకత, సైబర్ మోసాలపై గుడ్లవల్లేరు ఎస్సై ఎన్.వి.వి. సత్యనారాయణ వివరించారు. అత్యవసరాలకు 112, సైబర్ నేరాలకు 1930కు వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.
GNTR: మేడికొండూరు మండలంలోని పేరేచర్ల భారీ గృహ లేఅవుట్‌ను కలెక్టర్ అన్సారియా శనివారం సందర్శించారు. మొత్తం 18,090 ఇళ్లలో, 9,600 అర్బన్ గృహాలు ఉన్నాయని.. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు త్వరగా ఇళ్లను అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
TPT: చెత్త రహిత, సుందర తిరుపతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ దండి మార్చ్ వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫోర్ బిన్ సిస్టం ద్వారా తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలు, ఈ-వేస్ట్‌గా చెత్తను వేరు చేయాలని సూచించారు.
SKLM: అంగన్వాడీలు సమయపాలన పాటించాలని మందస సీడీపీవోపీ అరుణ అన్నారు. శనివారం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రీ స్కూల్ సిలబస్ ప్రకారం అమలు జరపాలని సూచించారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. చిన్నారులకు ఈ కేవైసీ, ఆధార్ పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. టేక్ హోమ్ రేషన్ శత శాతం అమలు జరపాలని సూచించారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతపూర్‌లో ఎల్లమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పురవీధుల గుండా ఊరేగించారు. కౌన్సిలర్ బండ్లగూడ ప్రశాంత్, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.