• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయం మార్పు

BHNG: చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం నూతన భవనానికి మార్చినట్లు తహశీల్దార్ వీరాబాయి తెలిపారు. పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేసిన కొత్త కార్యాలయంలో సోమవారం నుంచి సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రెవెన్యూ పనుల కోసం వచ్చే ప్రజలు పాత భవనానికి కాకుండా కొత్త భవనానికే రావాలని ఆమె సూచించారు. మార్పును గమనించాలని తెలిపారు.

February 23, 2026 / 03:29 PM IST

’10 పరీక్షలకు 24, 658 మంది విద్యార్థులు’

SRD: జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు 123 పరీక్షా కేంద్రాల్లో 24,658 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరీక్ష ఏర్పాట్లపై సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు.

February 23, 2026 / 03:27 PM IST

రెబ్బెనలో వర్షం.. అన్నదాతల ఆందోళన

ASF: రెబ్బెన మండలంలో ఇవాళ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. చేతికి వచ్చిన పత్తి పంట తడిసి ముద్దవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకస్మికంగా కురిసిన ఈ వర్షం వల్ల పంట నేలపాలైందని, పెట్టుబడి కూడా దక్కేలా లేదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తడిసిన పత్తిని కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 03:27 PM IST

అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ క్యాంపు కార్యాలయంలో సోమవారం పూలకుంటపల్లి పెద్ద తండా గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడుకు ఈ నెల 27, 28 తేదీలలో జరిగే శ్రీ శ్రీ టకరమ్మ, శ్రీ భనకమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.

February 23, 2026 / 03:27 PM IST

ధర్మవరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

సత్యసాయి: ధర్మవరంలో టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌ సోమవారం పంపిణీ చేశారు. తాడిమర్రి, ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.15 లక్షల విలువైన 26 చెక్కులను అందజేశారు. శ్రీరామ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరట కలిగిస్తోందని తెలిపారు.

February 23, 2026 / 03:26 PM IST

ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారులు

WGL: నల్లబెల్లి GP ఆవరణంలో ఇవాళ ఉద్యమకారుల పోరం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాంబారావ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యమకారులను కనీసం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి వారికి బాసటగా నిలుస్తానని ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు.

February 23, 2026 / 03:25 PM IST

అభివృద్ధి పనులకు భూమి పూజ

ADB: తలమడుగు మండలం కజ్జర్లలో ఉపాధి హామీ నిధులు రూ. 25 లక్షలతో మంజూరైన కల్వర్టు, టాయిలెట్ రూమ్స్ పనులకు సోమవారం భూమి పూజ నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, సర్పంచ్ ఎల్మా నారాయణరెడ్డి ఈ పనులను ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబన్న, దేవారెడ్డి, గంగన్న, కమలాకర్ తదితరులున్నారు.

February 23, 2026 / 03:25 PM IST

‘నిర్ణీత గడువులోగా వినతులు పరిష్కరించాలి’

VZM: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ప్రజలు సమర్పించిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో RDO కీర్తితో కలిసి ఆయన వినతులు స్వీకరించారు. అర్జీలపై సంబంధిత జిల్లా, మండల అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు.

February 23, 2026 / 03:25 PM IST

గోవిందమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం

TPT: సత్యవేడు మండలం మధనంబేడు గ్రామంలో మృతి చెందిన గోవిందమ్మ కుటుంబానికి టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్ పరుచూరి శివకుమార్ నాయుడు రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. ఆయన తరఫున పార్టీ ప్రతినిధులు గ్రామానికి వెళ్లి బంధువులకు నగదు అందజేశారు. దహన సంస్కారాల కోసం ఈ సహాయం అందజేసినట్లు తెలిపారు.

February 23, 2026 / 03:24 PM IST

‘భీమిలిలో వైసీపీ జెండా ఎగరవేస్తాం’

VSP: రాబోయే ఏ ఎన్నికల్లోనైనా భీమిలిలో వైసీపీ ఘనవిజయం సాధించి జెండా ఎగరవేయడం ఖాయమని భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరి సహస్ర (సిరమ్మ) ధీమా వ్యక్తం చేశారు. అవనాంలో జరిగిన మండల స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామ కమిటీలను వెంటనే పూర్తి చేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

February 23, 2026 / 03:23 PM IST

‘ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి’

JGL: ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెగడపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ నరేశ్ కోరారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణుల కోసం ప్రత్యేకంగా ‘ఏఎన్సీ డే’ క్లినిక్ నిర్వహించి, వారికి రక్త పరీక్షలు చేసి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.

February 23, 2026 / 03:22 PM IST

జనసేన సభ్యత్వ నమోదుపై సమీక్ష

SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ విశ్వక్సేన్ అన్నారు. సోమవారం నియోజకవర్గ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. పార్టీని బూత్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు బలోపేతం చేయడం లక్ష్యంగా సభ్యత్వాన్ని 25 వేల సంఖ్యకు చేర్చాలని సూచించారు.

February 23, 2026 / 03:21 PM IST

‘మహిళ పోలీసుల పాత్ర కీలకం’

ASR: నేరాల నియంత్రణ, నేరాలపై ప్రజలలో అవగాహన కల్పించడంలో మహిళా పోలీసుల పాత్ర ముఖ్యమైనదని పాడేరు డీఎస్పీ అభిషేక్ అన్నారు. సోమవారం అరకులోయలో అరకులోయ, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల మహిళా పోలీసులతో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. మహిళా పోలీసులు గ్రామాలలో నాటు సారా, గంజాయి సాగు, రవాణా, వినియోగం చట్టరీత్యా నేరమని ప్రజలకి అవగాహన కల్పించాలని సూచించారు.

February 23, 2026 / 03:19 PM IST

యువజన విద్యార్థి ప్రజా సంఘాల ధర్నా

ELR: బుట్టాయిగూడెం మండలం K.R.పురం ఐటీడీఏ వద్ద యువజన విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. మండల కేంద్రంలో ఎస్టీ బాలుర కళాశాల హాస్టల్ స్థలంలో నిర్మిస్తున్న వ్యాపార భవన నిర్మాణాలను ఆపివేయాలన్నారు. యధావిధిగా అదే స్థలంలో హాస్టల్ భవన నిర్మాణాలు చేపట్టాలని, గిరిజన విద్యార్థులను విద్యకు దూరం చేయొద్దని పిఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

February 23, 2026 / 03:19 PM IST

కీలక మ్యాచ్‌లు ‘మోదీ స్టేడియం’లోనే ఎందుకు..?

అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరిగిన 2023 WC ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన ఓటమిని భారత్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. తాజాగా S-8లో సౌతాఫ్రికా చేతిలో కూడా ఇదే స్టేడియంలో భారత్ చిత్తుగా ఓడింది. ఫైనల్ కూడా ఇదే స్టేడియంలో జరగబోతోంది. దీంతో, ‘భారత్‌కు అచ్చిరాని ఈ స్టేడియంలోనే కీలక మ్యాచ్‌లు ఎందుకు నిర్వహించాలి?’ అంటూ అభిమానులు SMలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

February 23, 2026 / 03:19 PM IST