TG: తెలంగాణ మావోయిస్టు కేడర్ లొంగిపోయేందుకు సిద్ధమైంది. రేపు రాష్ట్ర DGP శివధర్ రెడ్డి ఎదుట దేవోజీ@తిప్పిరి తిరుపతి, మల్లారాజిరెడ్డి చుక్కారావు@దామోదర్, నున్నె నరసింహారెడ్డి సహా మొత్తం 18 మంది ఆయుధాలను విడిచిపెట్టనున్నారు. దీంతో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారనుండగా.. దీనిపై రేపు DGP అధికారిక ప్రకటన చేయనున్నారు.
NGKL: అర్హులైన ప్రతి జర్నలిస్టుకు షరతులు లేకుండా, పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని TWJF జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు పరిపూర్ణం, వెంకటస్వామి, పరమేశ్ కోరారు.
పైనున్న చిత్రం భాగ్యనగరపు నడిబొడ్డున వెలిసిన అందమైన దృశ్యంలా ఉంది. చారిత్రక చార్మినార్ రాత్రివేళ కాంతులతో మెరిసిపోతుంటే, దాని ముందు గాలిలో తేలుతున్న ఎర్రని బెలూన్లు ప్రేమానురాగాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. చీకటిని చీల్చుకుంటూ ఆ బెలున్లు పాతబస్తీ సంస్కృతికి ఆధునిక ప్రేమ సందేశాన్ని జోడించాయి. ఈ చిత్రం HYD ఆప్యాయతను, చారిత్రక సౌందర్యాన్ని ఒకే ఫ్రేమ్‌లో బంధించింది.
RR: హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాల ఆక్రమణలపై ప్రజల నుంచి సోమవారం మొత్తం 59 వినతులు అందాయి. హయత్‌నగర్, అమీన్‌పూర్, మియాపూర్ వంటి ప్రాంతాల్లో లేఅవుట్ స్థలాలను ప్లాట్లుగా మారుస్తున్నారని బాధితులు కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన కమిషనర్, సంబంధిత అధికారులకు విచారణకు ఆదేశించారు.
ఖమ్మం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా పౌర కేంద్రీకృత పాలన దిశగా కీలక అడుగు పడింది. గౌరవ మేయర్ నీరజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను నేరుగా స్వీకరించి, వాటిని సమర్థవంతంగా పరిష్కరించడంపై దృష్టి సారించారు. ప్రజలతో స్వయంగా ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా మైన్ క్లోజర్ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ ఇండియాను సందర్శించారు. అలాగే బటర్‌ఫ్లై పార్కును ప్రారంభించారు. అనంతరం శాస్త్రవేత్తలతో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తవ్వకంపై చర్చించారు. మైన్ క్లోజర్ జాతీయ ప్రాధాన్యత అంశం అని పేర్కొన్నారు.
NTR: జిల్లాలోని పెనుగంచిప్రోలు గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. దేవాలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు సమర్పించారు.
SDPT: భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ పోరాడుతుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్మికులకు ప్రభుత్వం అందించే బీమా సౌకర్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
శిశువు పుట్టిన వెంటనే ఏడవడం ఆరోగ్యానికి చాలా మంచిది. గర్భం నుంచి బయటి ప్రపంచంలోకి రాగానే, శిశువు ఊపిరితిత్తులు తెరుచుకుని సొంతంగా శ్వాస తీసుకోవడానికి ఈ ఏడుపు సహాయపడుతుంది. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. మెదడు ఎదిగి భావాలు తెలిశాకే నవ్వు వస్తుంది. అందుకే శిశువు పుట్టగానే నవ్వకుండా కేవలం ఏడుస్తుంది.
MDK: విద్యార్థులు లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకొని ఆ దిశగా కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఎంఈఓ డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణ పరిధి రావెల్లిలోని నర్సాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ విజయానికి తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. కోఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రకాశం: గిద్దలూరు మండలం తాడివారి పల్లి చెక్ పోస్ట్, పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తుంది. గత నాలుగు రోజుల నుంచి రహదారిపై చిరుత పులి వాహన దారుల కంట పడుతుందని, రోల్లగుంపాడు నుండి ఫారెస్ట్ చెక్ పోస్ట్ మధ్యలో, ఆశ్రమం దగ్గర చిరుత సంచారం ఉందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
GNTR: నిడుబ్రోలు 11వ వార్డు రామ మందిరం ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నేత జాగర్లమూడి నాగేశ్వరావు సోమవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాగేశ్వరావు మృతికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కూటమి నేతలు, శ్రేణులు సంతాపం తెలిపారు. అంతిమ కార్యక్రమం మంగళవారం ఉదయం నిర్వహించనున్నారు.
జింబాబ్వేపై హెట్మేయర్ 34 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు బాదాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత WCలో మొత్తంగా 17 సిక్సర్లు కొట్టాడు. దీంతో సింగిల్ T20 WC ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో పూరన్(17)తో కలిసి హెట్మేయర్ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే, ఈ మెగాటోర్నీ పూర్తయ్యేలోపు అతడు ఈ రికార్డును మరింతగా మెరుగుపరుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
BDK: జిల్లాలోని పలు గ్రంధాలయాల అభివృద్ధికి రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి ఇటీవల 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు సోమవారం వారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.