BDK: కరకగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ పోలే బోయిన సుజాత అభివృద్ధి పనులలో భాగంగా ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి సమస్యను శనివారం పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి సమస్యతో పాటు గ్రామంలోని ఇతర మౌలిక వస్తువుల సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాన్ని తెలిపారు.
VZM : గంజాయి రవాణకు పాల్పడినా, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతోపాటు, చెక్ పోస్టులను బలోపేతం చేసామని తెలిపారు. గంజాయి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే 1972కు సమాచారం అందించాలన్నారు.
KMR: బాన్సువాడలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రిలియన్స్ మార్ట్ వద్ద జరిగిన గొడవ, కానిస్టేబుల్‌పై దాడికి సంబంధించి ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం బృందాలు గాలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
AP: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలక నిందితుడు వాసుదేవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వాసుదేవరెడ్డి A2గా ఉన్నారు. రూ.3,500 కోట్ల స్కాంలో ఆయన కీలక నిందితుడని సిట్ నివేదికలో పేర్కొంది. కాగా ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రూ.7.50 కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పలు కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇంజనీర్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
KNR: సైదాపూర్ మండలం ఆకునూర్ కస్తూరిబా బాలికల విద్యాలయంలో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌వో రజిత మాట్లాడుతూ.. ఒక వ్యక్తి తన చిన్నతనంలో కుటుంబ సభ్యుల ద్వారా నేర్చుకునే భాషనే మాతృభాష అంటారని పేర్కొన్నారు. ఇది మనిషికి వ్యక్తిత్వంతో పాటు గుర్తింపునిస్తుందని తెలిపారు.
E.G: వైసీపీ జిల్లా సోషల్ మీడియా కార్యదర్శిగా పెదపాటి చిన్నబాబును నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. గోపాలపురం నియోజకవర్గంలోకి చెందిన చిన్నబాబు, పార్టీ పథకాలు, కార్యాచరణను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తానేటి వనితకు కృతజ్ఞతలు తెలిపారు.
PPM: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, దానికి కఠిన శిక్షలు తప్పవని లోక్ అదాలత్ సభ్యులు మరియు సీనియర్ న్యాయవాది టీ. జోగారావు అన్నారు. శనివారం గరుగుబిల్లిలో పార్వతీపురం మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా జోగారావు మాట్లాడుతూ.. భూతగాదాలు సమాజ శాంతి భద్రతపై ప్రభావం చూపుతాయని అన్నారు.
AKP: ఎస్ రాయవరం మండలం రేవు పోలవరంలో యువత కోసం క్రికెట్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. దీని అభివృద్ధి కోసం గ్రామానికి చెందిన వాసుపల్లి అడవిరాజు రూ. లక్ష విరాళాన్ని ప్రకటించారు. శనివారం చెక్కును రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా గ్రామ యువతకు అందజేశారు. క్రీడలను ప్రోత్సహించడానికి దాతలు ముందుకు రావాలని హోం మంత్రి పిలుపునిచ్చారు.
SDPT: దుబ్బాక మండలం రామక్కాపేట గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల వసతి చదువుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దని ఉపాధ్యాయులకు సూచించారు.
అన్నమయ్య: మదనపల్లిలోని కృష్ణ కళ్యాణ మండపంలో ‘పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026’ కార్యక్రమం శనివారం జరిగింది. BJP పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుష్పలత మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో శిక్షణ తరగతులు నిర్వహించాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో ఈ శిక్షణలు కీలకమని ఆమె సూచించారు.
NRPT: దొంగతనాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన చౌరస్తాల్లో పోలీస్ సిబ్బందితో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల చేతి వేలి ముద్రలను ప్రత్యేక డివైజ్‌తో తనిఖీ చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల ప్రజలు ఆస్తి పన్నును గడువులోగా చెల్లించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారి రాజు శనివారం ప్రకటనలో తెలిపారు. పన్నుల వసూలుకు 18 బృందావనం ఏర్పాటు చేశామని ఇందుకోసం వార్డు ఆఫీసర్లు ఇంటింటా తిరుగుతూ పన్నులను వసూలు చేస్తున్నారని ఆయా వార్డ్ ఆఫీసర్లకు తమ పన్నులను చెల్లించి అధికారులకు సహకరించాలని తెలిపారు.
W.G: ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో వైసీపీ ఆకివీడు మండల అధ్యక్షులు నంద్యాల లక్ష్మి సీతారామయ్య స్వగృహం వద్ద శనివారం వేద పండితుల వేద ఆశీర్వచనాలతో గోమాతకు శ్రీమంతం చేశారు. గోమాతను పూజిస్తే సుఖశాంతులు కలుగుతాయని తెలిపారు. నంద్యాల లక్ష్మీ సీతారామయ్య దంపతులు, పవన్ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.
సత్యసాయి: పరిగిలోని సేవా మందిర్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రత, బాల్య వివాహాలు, ఫోక్సో చట్టాలపై డీఎస్పీ నర్సింగప్ప అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.