• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మెరిసే చర్మం కోసం అరటిపండు!

అరటిపండు ఆరోగ్యానికే కాదు, సహజ సౌందర్యానికి అద్భుత ఔషధం. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం చర్మాన్ని మృదువుగా మార్చి మెరుపును ఇస్తాయి. బాగా పండిన అరటి గుజ్జును ఫేస్ ప్యాక్‌గా వాడితే ముడతలు, మృతకణాలు తొలగిపోతాయి. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తూ మొటిమల మచ్చలను తగ్గించి, ముఖాన్ని తాజాగా ఉంచుతుంది.

February 21, 2026 / 03:12 PM IST

ఉగ్ర కుట్రపై డీఐజీ కీలక ప్రకటన

HYD: చంచల్‌గూడ సెంట్రల్ జైలు వేదికగా ఉగ్రకుట్ర జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా వదంతులేనని జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ శ్రీనివాస్ పేర్కొన్నారు. నిర్ధారణ లేని వార్తలు ప్రసారం చేయవద్దని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని గుర్తు చేశారు. జైలులో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన జాహిద్ అనే ఖైదీ ఒక్కరే ఉన్నాడని డీఐజీ శ్రీనివాస్ తెలిపారు.

February 21, 2026 / 03:10 PM IST

కాంగ్రెస్ తీరు ఆవేదన కలిగించింది: చంద్రబాబు

AP: రాష్ట్రంలో టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ మెచ్చుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. AI సదస్సులో కాంగ్రెస్ వాళ్ల అర్థనగ్న ప్రదర్శన ఆవేదన కలిగించిందన్నారు. కాంగ్రెస్ తీరు దేశానికి మంచిది కాదని హితవు పలికారు. విశాఖలో 15 బిలియన్ డాలర్లతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

February 21, 2026 / 03:08 PM IST

PACS ఉద్యోగుల నిరసన దీక్ష

PPM: రైతుల ఆర్థిక స్థితిగతుల పెంపుదల కోసం, ప్రభుత్వ లక్ష్యాలను అమలుపరుస్తూ నిరంతరం సేవ చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చలేక పోతుందని ఎఐటీయుసీ మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ విమర్శించారు. వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక (జెఎసి) చేస్తున్న నిరసనకు మద్దతు తెలియజేశారు.

February 21, 2026 / 03:07 PM IST

‘మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలు’

MNCL: విద్యార్థుల మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలను జన్నారం మండలంలోని లోతరే గ్రామ సర్పంచ్ బోడ శంకర్ సూచించారు. శనివారం లోతరేలో పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంచి విద్యకు పెట్టింది పేరు ప్రభుత్వ పాఠశాలలని స్పష్టం చేశారు. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు.

February 21, 2026 / 03:06 PM IST

బీసీ సంఘం యువజన అధ్యక్షులుగా కోటేశ్వరరావు

NLG: దేవరకొండలోని రాంనగర్ 16వ వార్డుకు చెందిన రెడ్డి కోటేశ్వరరావు నియోజకవర్గ బీసీ సంఘం యువజన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. పదవీకాలం రెండు సంవత్సరాలు కొనసాగుతుందని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 03:05 PM IST

రాజ్యాంగ పరిరక్షణకు సీపీఐ పిలుపు

VSP: అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా డాబా గార్డెన్స్‌లోని అంబేద్క‌ర్ విగ్రహానికి సీపీఐ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ మాట్లాడుతూ.. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని విమర్శించారు. ఒక శాతం కార్పొరేట్ల వద్ద పోగుపడిన సంపదపై పన్నులు వేసి ప్రజలకు పునర్వినియోగం చేయాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 03:05 PM IST

‘బెల్ట్ షాపులను తక్షణమే రద్దు చెయ్యాలి’

BDK: మద్యం వ్యాపారుల కనుసన్నల్లో నడుస్తున్నా బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ రాజు దొర డిమాండ్ చేశారు. శనివారం నాయకులతో సమావేశమై మాట్లాడుతూ.. అధికారులు స్పందించకుంటే ఆదివాసీ నాయకులకు కలిసి చర్ల మండలంలోని ఏజెన్సీ ఆదివాసీ గ్రామల్లో ఉన్న బెల్ట్ షాపులుపై దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు.

February 21, 2026 / 03:05 PM IST

IND vs SA: తుది జట్టులో కీలక మార్పులు..!

అహ్మదాబాద్ వేదికగా రేపు భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య సూపర్-8 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించేలా ఉండటంతో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లతో భారత్ బరిలోకి దిగనుంది. అలాగే, ఓపెనర్ అభిషేక్ శర్మపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అతని స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించే వీలుంది.

February 21, 2026 / 03:04 PM IST

ఒకే వేదికపై కాంగ్రెస్ MLA, BRS మాజీ MLA

HNK: ఒకే వేదికపై కాంగ్రెస్ పార్టీ MLA, BRS మాజీ MLA కనిపించిన దృశ్యం శనివారం చోటు చేసుకుంది. ACP క్రైమ్ వరంగల్ సదయ్య కుమార్తె వివాహ వేడుక నేడు ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి మాజీ MLA గండ్ర వెంకటరమణ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇరువురు నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

February 21, 2026 / 03:03 PM IST

సెల్‌ఫోన్ సరిగా వాడితే బ్రహ్మాండమైన అస్త్రం: సీఎం

AP: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అందరికీ సెల్‌ఫోన్లు ఉన్నాయని కానీ సరిగా వాడటం లేదన్నారు. 24 గంటలు సెల్‌ఫోన్‌లో లేనిపోనివన్నీ చూస్తున్నారని చెప్పారు. సెల్ ఫోన్ ద్వారా సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. సద్వినియోగం చేసుకుంటే సెల్‌ఫోన్ బ్రహ్మాండమైన అస్త్రం అని వెల్లడించారు.

February 21, 2026 / 03:02 PM IST

జంగారెడ్డిగూడెంలో రెడ్ బుక్స్ డే

ELR: జంగారెడ్డిగూడెం CPM భవనంలో రెడ్ బుక్స్ డే సందర్బంగా లెనిన్ రచించిన పెట్టుబడిదారి అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అనే పుస్తకం మీద చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ సూర్యారావు మాట్లాడారు. 21-2-1848,లో మార్క్స్ & ఎంగిల్స్ కలసి రచించిన కమ్యూనిస్ట్ ప్రణాళిక విడుదల చేసిన రోజున ప్రపంచంలోని పెట్టుబడి దారి విధానానికి ఒక భూకంపం వచ్చిందన్నారు.

February 21, 2026 / 03:02 PM IST

తాగునీటి సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలి: కలెక్టర్

NGKL: జిల్లాలోని అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బిజినేపల్లి మండలంలోని వట్టెం, రాంరెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ తాగునీటి ఇంటింటి సర్వేను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.

February 21, 2026 / 03:02 PM IST

ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయండి..

MDK: నిజాంపేట నూతన మండలంగా ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆధార్ సెంటర్ ఏర్పాటు కాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 16 గ్రామ పంచాయతీల ప్రజలు ఆధార్ అప్డేట్స్, కొత్త కార్డుల కోసం దుబ్బాక, రామాయంపేట, మెదక్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.

February 21, 2026 / 03:02 PM IST

‘NHM ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి’

ADB: నేషనల్ హెల్త్ మిషన్ (NHM)లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కోరారు. శనివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలోనూ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఆరోగ్య ప్రయోజనాలు కల్పించాలని కోరారు.

February 21, 2026 / 03:02 PM IST