ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు చొరవతో మంజూరైన రూ. 42 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆదివారం పంపిణీ చేయనున్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రజావేదిక కార్యాలయంలో 29 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను ఎమ్మెల్యే అందజేస్తారు.
E.G: కోరుకొండలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను ఆలయ అధికారులు శనివారం కలిసి ఉత్సవాలకు సంబంధించి మొదటి శుభలేఖను అందజేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
PLD: జిల్లా యాదవ యువజన సంఘం అధ్యక్షుడిగా మాచవరం మండలం రేగులగడ్డకు చెందిన జక్కుల కృష్ణ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చింకా నారాయణ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. జిల్లాలోని యాదవుల హక్కుల కోసం పోరాడుతూ, నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.
KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు నిర్వహించనున్న అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి జోన్-4 అధికారి అలివేలు తెలిపారు. మొత్తం 68 కేంద్రాల్లో 25,140 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు ఉదయం 9.30 గంటలకే కేంద్రానికి చేరుకోవాలని, గంట ముందే గేట్లు మూసివేస్తారని స్పష్టం చేశారు.
TPT: జిల్లా రేణిగుంట శ్రీరాజరాజేశ్వరీ దేవి జ్ఞానపీఠంలో మహా శివలింగ ప్రతిష్ఠాపన శుక్రవారం ఘనంగా జరిగింది. 32 దేశాల నుంచి 140 మంది విదేశీ భక్తులు హాజరయ్యారు. శివనామ స్మరణల మధ్య రుద్రాభిషేకం, మహా చండీ హోమం నిర్వహించారు. జర్మనీ గురూజీ పరమహంస విశ్వనంద స్వామీజీ చేతుల మీదగా పూజా కార్యక్రమాలు జరిగాయి. విదేశీ భక్తులు సైతం శివ నామ స్మరణలతో మైమరిచిపోయారు.
NLG: రాష్ట్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 31.12.2025 నాటికి 30 ఏళ్ల వయస్సు, 10 ఏళ్ల అనుభవం ఉన్న చేనేత కళాకారులు; అలాగే, 25 ఏళ్ల వయస్సు, 5 ఏళ్ల అనుభవం ఉన్న డిజైనర్లు అర్హులు. ఆసక్తిగల వారు మార్చి 31 లోపు జిల్లా చేనేత శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
NZB: మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన సుశాంక్ జాతీయ స్థాయి సీనియర్ కబడ్డి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా కబడ్డి కోచ్ మీసాల ప్రశాంత్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడకారుడు ఎంపికవడంపై జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కార్యవర్గ సభ్యులు పలువురు అభినందనలు తెలిపారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం వటపత్రశాయిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహాద్భుత దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. ప్రధానాలయంలో స్వామివారిని వంటపత్ర శాయి అలంకారంలో ప్రత్యేక పల్లకిపై అధిష్టించారు. అనంతరం డోలు సన్నాయి, మేళాలతో స్వామివారిని ప్రధాన మాఢ వీధుల్లో ఊరేగించారు.
NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధి 5వ వార్డు పెర్కిట్లో కొత్తగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. కౌన్సిలర్ ప్రసాద్, స్థానిక నాయకులతో కలిసి పనుల నాణ్యతను తనిఖీ చేసిన ఆయన, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
KMM: ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ‘నెల నెలా వెన్నెల’ 103వ సాంస్కృతిక సమ్మేళనం జరగనుంది. అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలో హైదరాబాద్ కళాంజలి బృందం ప్రదర్శించే ‘యాగం’ నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కళాభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
SKLM: పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో స్వచ్ఛ ఆంధ్రా–స్వర్ణాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు . ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పీరుకట్ల విఠల్ రావు పాల్గొని పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఆసుపత్రి పరిసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
ప్రకాశం: దొంగతనాలే వృత్తిగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న దొంగకు 3 నెలలు జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం గిద్దలూరు కోర్టు తీర్పించింది. కంభంకు చెందిన రసూల్ అనే పాత నేరస్తుడు కంభం మండలం నర్సిరెడ్డిపాలెం పోలేరమ్మ గుడిలో ఉండి పగలగొట్టి నగదు దోచుకున్నాడు. అలానే కంభంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న బాలాజీ ఎలక్ట్రికల్ షాపులో రసూల్ చోరీకి పాల్పడ్డాడని ఎస్సై తెలిపారు.
పెద్దగా అంచనాల్లేకుండా T20 WCలో అడుగుపెట్టిన జింబాబ్వేను సూపర్-8కు చేర్చడంలో బ్లెసింగ్ ముజర్బానీది కీలక పాత్ర. ముఖ్యంగా 4/7 ప్రదర్శనతో కంగారూలు ఇంటి బాట పట్టేలా చేశాడు. ఈ నేపథ్యంలో T20 WC తర్వాత IPL వేలం జరిగితే అతను రూ.20 కోట్లకు పైగానే ధర పలికేవాడని భారత మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. బంతి కొత్త, పాత అని లేకుండా మంచిగా రాణిస్తున్నాడని కితాబిచ్చాడు.
NGKL: జిల్లా లైసెన్స్ సర్వేయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్నిశుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లేష్, వైస్ ప్రెసిడెంట్‌గా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా దినేష్, కోశాధికారిగా సురేష్ బాధ్యతలు చేపట్టారు. నూతన అధ్యక్షులు మాట్లాడుతూ..సర్వేయర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
NRML: నిర్మల్ నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతూ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుచాడి శ్రీహరి రావు వినతిపత్రం ఇచ్చారు. వెంగ్వపేట చెరువును సాగునీటి, పర్యాటక ప్రాంతంగా మార్చాలని, వాస్తపూర్ జలపాతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.