ADB: బోథ్ మండలంలోని కూచులాపూర్ గ్రామంలో వీధి కుక్కల బీభత్సంతో పలు పశువుల మృత్యు బారిన పడుతున్నాయి. ఆదివారం గ్రామంలోని లస్మన్నకు చెందిన ఆవు దూడపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. అంతకు ముందు పలు మేకలు కుక్కల బారిన పడ్డాయి.
SRD: ప్రతి ఒక్కరికి దైవచింతన ఉండాలని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ తాబేలు గుట్టలో నూతన శ్రీ జీవన జ్యోతిర్లింగ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గుమ్మడిదల బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధికి రూ.1,51,000 విరాళం అందజేశారు. దైవానుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు.
WG: పాలకోడేరు(M) విస్సాకోడేరులోని ఓ చర్చిలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం జరిగింది. ఆ సంస్థ సభ్యులు శ్రావ్య శృతి మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించుకోవచ్చాన్నారు. ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు, మహిళలు అక్రమ రవాణా ఉచ్చులో పడుతున్నారన్నారు.
PDPL: అనివార్య కారణాల వల్ల చదువు మధ్యలో మానేసిన వారికి ఆదివారం ధర్మారం కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఓపెన్ టెన్త్, ఇంటర్ బేస్ లైన్ పరీక్షలు నిర్వహించినట్లు కోఆర్డినేటర్ వడ్లూరి కిరణ్ తెలిపారు. చివరి పరీక్షలు ఏప్రిల్లో పెద్దపల్లిలో నిర్వహించబడతాయని ఆయన పేర్కొన్నారు. అందుకోసం విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
NDL: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంను రాజకీయాల్లోకి లాగడం తగదని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అభ్యంతరకరమని, శ్రీవారిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం పాపమని విమర్శించారు.
PPM: జిల్లాలో రేపటి నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి విద్యార్థులకు సూచించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. నిమిషం ఆలస్యం అయినా అనుమతించారన్నారు.
ATP: శింగనమల మండలం శోధన పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న వారిని మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసులు ఆదివారం పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాల మేరకు అస్వస్థకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
BDK: నిర్మాణంలో నాణ్యత పాటించాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే పాయం ఆదేశించారు. పినపాక మండలంలోని పోతిరెడ్డిపల్లి క్రింది గుంపు వాగుపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. సుమారు రూ. 65 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు.
KKD: పిఠాపురం ఎక్సైజ్ పరిధిలో మద్యం అమ్మకాలు కేవలం MRP ధరలకే జరుగుతున్నాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారి సుబ్బలక్ష్మి స్పష్టం చేశారు. ఆదివారం తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ధరలకు మద్యం అమ్మితే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో పార్టీలో ఆదివారం నూతన చేరికలు జరిగాయి. 31వ డివిజన్ అక్కచెరువుపాడుకు చెందిన పలువురు TDP తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో కష్టపడి పని చేయాలని MLA సూచించారు.
అహ్మదాబాద్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య T20 WC సూపర్-8 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 7 T20 WC మ్యాచ్‌ల్లో భారత్ 5 విజయాలు సాధించి ఆధిపత్యం చాటుకుంది. ఇదే రికార్డును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు SA కూడా పటిష్టంగా ఉండటంతో ఈ పోరు ఉత్కంఠగా మారింది.
MHBD: కోటగుళ్ళు శిల్ప సంపద అద్భుతమని ఇంగ్లాండ్ దేశానికి చెందిన సిమన్, వాలేరీలు అన్నారు. ఆదివారం ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను చరిత్రను రామప్ప గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ఫోటోలు, వీడియలు తీసుకున్నారు.
కడప: నగరంలో గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఎస్పీ ఆదివారం పాత బస్టాండ్, రైల్వే స్టేషన్, బుగ్గవంక వంటి ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టారు. స్పెషల్ పార్టీ పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు.డ్రోన్ల నిఘా ద్వారా దాడులు నిర్వహిస్తామన్నారు.
BDK: కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేపు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని క్యాంప్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటించారు. కొత్తగూడెం, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కూనంనేని అందజేస్తారని అన్నారు. అందరూ సకాలంలో హాజరు కావాలన్నారు.
HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 61 డివిజన్ చైతన్యపురి కాలనీలో తెలంగాణ రాజ్య అధికార పార్టీ లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆదివారం చేరారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వ్యక్తులకు నగరాధ్యక్షుడు అయినవోలు మల్లికార్జున శాస్త్రి కండువాలు కప్పి ఆహ్వానించారు.