NDL: రంజాన్ మాసం నేపథ్యంలో నంద్యాలలో సీసీ కెమెరాల నిఘా మరింత పెంచాలని ఎస్పీ సునీల్ షోరాన్ పోలీసులకు సూచించారు. శనివారం విజిబుల్ పోలింగ్‌లో భాగంగా నంద్యాలలో పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. బొమ్మల సత్రం ఆర్టీసీ బస్టాండ్ బైర్మల్ విధి శ్రీనివాస సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.
మెదక్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.206 నుంచి రూ.230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ.234 నుంచి రూ.260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గింది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చుని వ్యాపారులు తెలిపారు.
GNTR: ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ సిద్ధమైందని శనివారం ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు సీసీ కెమెరాలు అమరిక, ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు.
KRNL: బెంగళూరులో స్థిరపడ్డ గ్రామ వాసి శ్రీ నాగరాజేంద్ర గౌడ్ గ్రామంలోని 5–12 ఏళ్ల పిల్లల కోసం ఉచిత యోగా శిక్షణ, గ్రంథాలయం, వ్యక్తి వికాస్ కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్యం, విద్యా అభివృద్ధి లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామస్తులు ఈ సేవను అభినందించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.206 నుంచి రూ.230 మధ్య ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.234 నుంచి రూ.260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ.5 వరకు తగ్గింది. అయితే, ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని వ్యాపారస్థులు తెలిపారు.
PDPL: గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే లక్ష్యమని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి గణేష్ తెలిపారు. నిన్న సుల్తానాబాద్ మండలం గట్టేపల్లిలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అవగాహనతోనే న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ATP: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ప్రపంచ తెలుగు కవుల మహాసభల్లో MLA దగ్గుపాటి ప్రసాద్ కుమార్తె ఆశ్రితకు ‘యూత్ ఐకాన్’ అవార్డు లభించింది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా 25 కుటుంబాలను దత్తత తీసుకున్నందుకు ఆమెకు ఈ గౌరవం వరించింది.
SKLM: సారవకోట మండలం అలుదు ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆనందరావు తెలిపారు. శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పరిసర ప్రాంతాల ప్రజల ఈ విషయాన్ని గమనించి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KNR: స్థానిక బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థులు శనివారం తెలంగాణ గ్రామీణ బ్యాంకును సందర్శించారు. హెచ్ఎం జలీల్, ఉపాధ్యాయులు కుమార్, పుష్పలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ అనిల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఖాతాల రకాలు, డిపాజిట్లు, వడ్డీ రేట్లు, రుణాల ప్రక్రియ గురించి వివరించారు.
జనగామ పట్టణంలో నేడు చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. బ్రాయిలర్ చికెన్ కిలో రూ.280–300, దేశీ కోడి కిలో రూ.350–380 వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడం కారణంగా ధరలు ఎగసినట్లు తెలిపారు. ధరలు పెరగడంతో వినియోగదారులు కొనుగోలు తగ్గింది, తద్వారా మార్కెట్‌లో రద్దీ తగ్గినట్లు కనిపిస్తోంది.
AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం ఉదయం హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి ఆదివారం హ్యాపీ సండే పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో అందులో పాల్గొనేందుకు పలువురు పోటీపడ్డారు. డాన్సులు చేస్తూ పెద్దలు, పిల్లలు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, టౌన్ సిఐ షేక్ గపూర్ పాల్గొన్నారు.
KDP: కమలాపురం మండల MRO కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు శివరాంరెడ్డి తెలిపారు. మండలంలోని గ్రామ ప్రజలు తమ భూ-ఇతర రెవెన్యూ సమస్యలను అర్జీరూపంలో సమర్పించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కడప రెవెన్యూ డివిజన్ అధికారి కూడా హాజరవుతారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు నిర్వహించనున్న గిరిజన గురుకుల పాఠశాలల 5, 6, 7, 8, 9 తరగతుల 2026–27 విద్యా సం,లో ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గిరిజన గురుకులాల జాయింట్ సెక్రటరీ DS వెంకన్న తెలిపారు. RCO కార్యాలయంలో ప్రిన్సిపాల్లతో సమక్షంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కోరారు.
NDL: జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్ ధరలు సాధారణంగా ఉన్నాయి. నంద్యాల వెలుగోడు జూపాడుబంగ్లా గడివేముల తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.195 స్కిన్ రూ. 220 స్కిన్ లెస్ రూ. 240-270 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ. 800-950 చేపలు రూ.180కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఫ్రెండ్ ప్రమోద్ శెట్టి హాట్ కామెంట్ చేశాడు. ‘నాకు రష్మిక పెళ్లికి ఇన్విటేషన్ రాలేదు. వస్తే నేను తప్పకుండా వెళ్తాను. కానీ, నాకు తెలుసు.. ఆమె మమ్మల్ని పిలవదు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు’ అని చెప్పుకొచ్చాడు.