యోగాసనాల్లో శవాసనం చేయడం చాలా సులభం. ఇది చాలా మందికి ఇష్టమైన ఆసనం కూడా. దీనికి శవంలా పడుకుంటే చాలు. శవాసనం చేస్తున్నప్పుడు పడుకుని మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేయాలి. కళ్ళు మూసుకుని ఈ ఆసనం వేసేటప్పుడు మనస్సు శరీరంలోని ప్రతి భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వాలి. దీంతో రక్తపోటు తగ్గుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గి మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
అన్నమయ్య: కలకడకు చెందిన శివమ్మ(42) తిరుమలలో ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసింది. ప.గో జిల్లా తనుకుకు చెందిన కుటుంబం గురువారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చింది. కాగా చిన్నారులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్లో తీసుకెళ్తుండగా కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, నిందితురాలిపై కేసు నమోదు చేసే అరెస్ట్ చేశారు.
సత్యసాయి: భారతీయ వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీ కోసం నిర్వహించే ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ కోరారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మార్చి 9 ఎంపికలు జరుగుతాయన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం సర్పంచ్, వైసీపీ సీనియర్ నాయకుడు చెరుకుల జనార్ధన్ యాదవ్‌ను రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కేంద్ర కార్యాలయం నియమించింది. ఈ సందర్భంగా ఆయన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.
BDK: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌ను ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకటరావు, గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు శుక్రవారం పాల్వంచలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలోని పలు సమస్యలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందుతున్నట్లు పేర్కొన్నారు.
NGKL: అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవి ప్రాంతంలోని రాయల గండిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని క్రీ.శ 1536లో చింతగుండ రంగారావు నిర్మించారు. ఈ ప్రాంతానికి రంగా రయుని గండి అని పేరు పెట్టగా కాలక్రమేన అది “రాయలగండి” గా ప్రసిద్ధి చెందింది. ఈ చెన్నకేశవ స్వామి ఆలయంలో మాల దాసరి వర్గానికి చెందిన వారు పూజలు నిర్వహించడం విశేషం.
CTR: మందస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి సంఘం డస్క్ బెంచీలను వితరణగా అందజేశారు. సుమారు రూ. 90 వేలు విలువగల 60 డస్క్ బెంచీలను పాఠశాలకు అందజేసి దాతృత్వాన్ని చాటారు. HM శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అసోసియేషన్ ఫౌండర్ ప్రొఫెసర్ మోహన్ ఆచారి నిధుల సమీకరణ జరిపి చేస్తున్న కృషి ఆదర్శప్రాయం అని కొనియాడారు.
✦ TG: ఢిల్లీ AI సమ్మిట్‌లో పాల్గొననున్న CM రేవంత్✦ నిజమాబాద్‌లో PCC చీఫ్ మహేష్ పర్యటన✦ AP: ఢిల్లీ పర్యటనకు CM చంద్రబాబు✦ ఏడో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు✦ T20 WC: ఆస్ట్రేలియా, ఒమన్ మధ్య చివరి గ్రూప్ మ్యాచ్✦ ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్: IND vs SL సెమీస్
SRPT: మేళ్లచెరువు మండలంలో జాతర సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా ముగిసింది. ఫైనల్ పోరులో విజయనగరం, వైజాగ్ జట్లు తలపడగా, విజయనగరం జట్టు విజేతగా నిలిచి లక్ష రూపాయల నగదు బహుమతిని కైవసం చేసుకుంది. విజేతకు ట్రోఫీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.
NTR: తిరువూరు లోని కేడీసీసీ బ్యాంక్ కార్యాలయం వద్ద నియోజకవర్గ పరిధిలోని తిరువూరు, గంపలగూడెం, ఏ కొండూరు, విసన్నపేట మండలాల సహకార సంఘాల ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా 4వ రోజు నిన్న ధర్నా చేశారు. జీవో నెం 36 అమలు చేయాలని, 2019 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ప్రకాశం: ఇంటర్ పరీక్షల నేపథ్యంలో అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులతో కొండేపి ఏమ్మెల్యే, మంత్రి స్వామి అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల పట్ల భయం లేకుండా రాయాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. గురుకుల విద్యార్థుల కొరకు పరీక్షలు రాసేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును తొలగించడాన్ని గురువారం వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. 2009లో పాలకమండలి తీర్మానం ప్రకారమే ఆ పేరు పెట్టారని ఆయన గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు.
JN: జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి కలిశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి వెళ్లిన ఆమె, పట్టణ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ఆర్డీవో గోపీరాంలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ శివరాజ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ATP: రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ఉర్దూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే పని చేస్తాయని డీఈఓ ప్రసాద్ బాబు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రంజాన్ మాసం ముగిసిన తర్వాత పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని వివరించారు.