• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు నరసాపురం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్

W.G: నరసాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రామరాజు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలపై ఆర్జీలు అందజేయవచ్చని తెలిపారు. సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

February 20, 2026 / 07:11 AM IST

‘పీఎం శ్రీ’ పెండింగ్ బిల్లులపై సమీక్ష

కరీంనగర్ జిల్లాలో ‘పీఎం శ్రీ’ కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలల్లో పెండింగ్ బిల్లుల అంశంపై విద్యాధికారులు, ప్రధానోపాధ్యా యులు, ట్రెజరీ శాఖ అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడితో కలిసి సమీక్షించారు. వేతన బిల్లులు మినహా అన్నిరకాల చెల్లింపులు వెనువెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

February 20, 2026 / 07:10 AM IST

హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్

SKLM: కొత్తూరు మండలం బ్రాహ్మణవీధికి చెందిన సాయికుమార్‌పై బీరు సీసాలతో దాడిచేసిన ఘటనలో గురువారం కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై కె. వెంకటేశ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కొత్తూరుకు చెందిన టి.వినయ్ కుమార్, సిరుసువాడ గ్రామానికి చెందిన కె. తరుణ్‌ను కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై పేర్కొన్నారు.

February 20, 2026 / 07:10 AM IST

కోహ్లీ లిస్ట్ అగ్రస్థానంలో సికందర్ రజా

జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో జట్టును T20 WCలో సూపర్-8కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను అంతర్జాతీయ T20 క్రికెట్‌లో అత్యధికంగా 19 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ టీమిండియా కెప్టెన్ సూర్య(17), అంతకుముందు విరాట్ కోహ్లీ(16) పేరిట ఉండేది.

February 20, 2026 / 07:09 AM IST

అంబటిని పరామర్శించిన మాజీ మంత్రి విడదల రజిని

PLD: ఇటీవల పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి, జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ మంత్రి విడదల రజిని గురువారం రాత్రి పరామర్శించారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన రజిని.. అంబటి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ ఆయనకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో చిలకలూరిపేట వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 07:08 AM IST

జిల్లాకు చేరిన యూరియా

CTR: జిల్లాలో రబీ పంటల సాగు కోసం 1150 టన్నుల యూరియా గురువారం చేరింది. ప్రస్తుతం జిల్లాలోని రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలు, గోదాముల్లో సుమారు 4,200 టన్నుల యూరియా నిల్వ ఉందని వ్యవసాయ శాఖ అధికారి మురళి తెలిపారు. యూరియా కొరత లేదని, అవసరమైన మండలాలకు వెంటనే సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.

February 20, 2026 / 07:08 AM IST

‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ దరఖాస్తుల ఆహ్వానం

JGL: ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ పథకంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ పాఠశాలల ఎంపికకు జిల్లాలోని ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పథకాల కింద ఎంపికైన పాఠశాలలకు విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, హాస్టల్ వసతి, భోజన వసతితో పాటు నగదు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

February 20, 2026 / 07:05 AM IST

నేడు సంగారెడ్డిలో జాబ్ మేళా

SRD: పట్టణం బైపాస్ రహదారిలో పాత డీఆర్‌డీవోలో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి నిర్మల తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఉదయం 11 గంటలకు జరిగే జాబ్ మేళాకు హాజరు కావాలని చెప్పారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని పేర్కొన్నారు.

February 20, 2026 / 07:05 AM IST

‘రైతులందరూ తప్పనిసరిగా Farmer ID కలిగి ఉండాలి’

కాకినాడ జిల్లాలోని రైతులందరూ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ APFR Farmer ID కలిగి ఉండాలని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ గురువారం సూచించారు. జిల్లాలో 2.07 లక్షల మంది రైతులకు గాను, కేవలం 1.69 లక్షల మందికే ఐడీ ఉందని తెలిపారు. ఈ గుర్తింపు ఉన్నవారికే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, పంటల బీమా వంటి పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.

February 20, 2026 / 07:04 AM IST

తిరుమలలో మిస్సింగ్ బాలికలు సురక్షితం

తిరుమలలో కనిపించకుండా పోయిన 5 ఏళ్ల నవదుర్గ, 3 ఏళ్ల అశ్విని అనే ఇద్దరు బాలికలను పోలీసులు సురక్షితంగా రక్షించారు. సీసీటీవీ ఆధారాలతో దర్యాప్తు జరిపి, చిన్నారులను అపహరించిన మహిళను కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

February 20, 2026 / 07:04 AM IST

‘ప్రతి మనిషి ఉన్న దానిలో తృప్తి పొందాలి’

PDPL: ప్రతి మనిషి ఉన్నదానిలో తృప్తి పొందాలని బ్రహ్మకుమారి అంజలి బెహన్ అన్నారు. రామగుండం సింగరేణి సంస్థ GM ఆఫీస్‌లో ఉద్యోగులకు నిత్య జీవితంలో ఒత్తిడికి కారణాలు-నివారణ మార్గాలపై గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పొంది అనుకున్నది సాధిస్తామని అన్నారు. వయసును అనుసరించి ఆహారపు అలవాట్లు ఉండాలని ఆమె సూచించారు.

February 20, 2026 / 07:03 AM IST

నేడు ఆత్మకూరులో మంత్రి రాక

WNP: ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన పాలకవర్గ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి డాక్టర్ శ్రీహరి హాజరవుతున్నట్లు ఛైర్ పర్సన్ నాగమణి రాజేశ్, వైస్ ఛైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు భారీగా తరలిరావాలని వారు కోరారు.

February 20, 2026 / 07:03 AM IST

పరీక్ష నిర్వహకులతో DEO సమావేశం

ADB: మార్చిలో జరిగే పదో తేదీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. 10వ తరగతి పరీక్షల నిర్వాహకులు చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్స్‌తో సమావేశం నిర్వహించారు. పదవ పరీక్ష ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించి సలహా సూచనలు చేశారు.

February 20, 2026 / 07:02 AM IST

NITCలో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాలికట్(NITC)లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. ఆర్ట్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. PhD ఉత్తీర్ణత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 45-50 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. 

February 20, 2026 / 07:02 AM IST

రైతుల సమస్యలపై గోడపత్రిక ఆవిష్కరణ

NTR: తిరువూరులో కౌలు రైతుల సమస్యలపై రైతులు గోడపత్రికను నిన్న ఆవిష్కరించారు. రైతు సంఘం నేతలు మాట్లాడుతూ.. భూమి లేని కౌలు రైతులను ప్రభుత్వం వెంటనే గుర్తించి, అన్నదాత సుఖీభవ పథకంలో సాగు ఖర్చుల కోసం కౌలు రైతులకు రూ.20,000 ఇవ్వాలన్నారు. ఈనెల 23, 24 తేదీలలో జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే 36 గంటల దీక్షలకు కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

February 20, 2026 / 07:02 AM IST