• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

28 ఏళ్ల మహిళ ఆత్మహత్య

ASR: రంపచోడవరం యర్రంరెడ్డినగర్ నివాసంలో శనివారం విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆశాజ్యోతి(28) ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ సన్యాసినాయుడు మీడియాకు తెలిపారు. దేవీపట్నం మండలానికి చెందిన ఆశాజ్యోతి, శివకుమార్ దంపతులు హోటల్ నిర్వహిస్తూ రంపచోడవరంలో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు.

February 22, 2026 / 12:08 PM IST

వైసీపీ నాయకులపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. శాసనమండలిలో శ్రీవారి చిత్రపటాలను చెప్పుల కాళ్లతో తాకి అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఆదివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. రసాయనాలతో కూడిన నెయ్యిని ఉపయోగించి కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు.

February 22, 2026 / 12:01 PM IST

మసీదుల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణం ఖాజా నగర్‌లో ఉన్న ఉర్దూ పాఠశాల, మసీదుల వద్ద చెత్తా అపరిశుభ్రంగా ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజలు నగర కమిషనర్ బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు నాయకులు దగ్గరుండి చెత్తా తొలగించి మసీదు వద్ద శానిటేషన్ పనులు చేశారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

February 22, 2026 / 12:00 PM IST

మహిళలను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్

సత్యసాయి: కదిరిలో టాటూ షాపు నిర్వహిస్తూ మహిళలను వేధిస్తున్న పవన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జల్సాల కోసం నాటు సారా విక్రయిస్తున్నట్లు గుర్తించి అతని నుంచి స్కూటీ, నిషేధిత సారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి సబ్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. అలాగే అతనిపై రౌడీ షీట్ తెరిచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

February 22, 2026 / 12:00 PM IST

‘ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే’

ప్రకాశం: ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని మార్కాపురం శివారులో వెలసిన శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఆదివారం కావడంతో భక్తులు రద్దీ అధికంగా ఉండడంతో పోలీసులు పట్టిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 12:00 PM IST

ఈ నెల 24న కాణిపాకం హుండీ లెక్కింపు

CTR: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ కానుకలను ఈ నెల 24న లెక్కించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించే హుండీ కానుకల లెక్కింపునకు ఆలయ అధికారులు, సిబ్బంది హజరు కావాలని కోరారు.

February 22, 2026 / 11:50 AM IST

నంద్యాలలో ఘనంగా శివరామకృష్ణ జన్మదిన వేడుకలు

నంద్యాలలో గోళ్ళ రాజేష్ కార్యాలయంలో సీనియర్ పాత్రికేయుడు శివరామకృష్ణ (RK9 NEWS ఎడిటర్) జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఆనందంగా నిర్వహించారు. ఈ సందర్భ ఇవాళ పలువురు పాత్రికేయులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉస్మాన్ భాష, మస్తాన్, నూర్ భాషా, కుమార్, శ్రీనివాసులు, భరత్ తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 11:50 AM IST

జాతీయ సమైక్యత శిబిరానికి మైదుకూరు విద్యార్థి ఎంపిక

KDP: మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS వాలంటీర్ ఏ.బాలు, బెలగావిలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 2 వరకు జరిగే జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికయ్యారు. ఈ శిబిరంలో ఆయన YVU తరపున APకు ప్రాతినిధ్యం వహిస్తారు.ప్రిన్సిపాల్ డా.పి.నారాయణరెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. జాతీయ స్థాయిలో బాలు ఎంపిక కావడం పట్ల NSS పీవో డా. కృష్ణారెడ్డి,అధ్యాపకులు,విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

February 22, 2026 / 11:47 AM IST

కోట్ల వారి పల్లెలో శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట

NDL: డోన్ పట్టణ పరిధిలో కోట్ల వారి పల్లెలో శ్రీ గంగ గంగమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన నేడు పాల్గొన్నారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

February 22, 2026 / 11:46 AM IST

కలికిరిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఘన నివాళి

అన్నమయ్య: రాయలసీమలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి సందర్భంగా కలికిరిలో రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులి సత్యనారాయణరెడ్డి పాల్గొని, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దుష్ట పాలనకు ఎదిరించి పోరాడిన వీరుడని తెలిపారు.

February 22, 2026 / 11:46 AM IST

ఉయ్యాల జీవిత చరిత్ర యువతకు ఆదర్శం: JC

VZM: బ్రిటిష్ నిరంకుశ పాలనపై గర్జించిన తొలితరం స్వాతంత్య్ర‌ సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ కొనియాడారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి ఆదివారం జరిపారు. అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా రైతులను ఏకం చేసి, ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన గొప్ప వీరుడు నరసింహారెడ్డి అని అన్నారు.

February 22, 2026 / 11:45 AM IST

ఆకాశాన్నంటిన అడ్డపిక్క ధర

ASR: గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన అడ్డపిక్కల కొనుగోలుకు ప్రజలు అధికంగా మక్కువ చూపిస్తున్నారు. వీటిని గిరిజనులు, మైదాన ప్రాంతాల వారు కొనుగోలు చేస్తుంటారు. అల్లూరి జిల్లాలో జరిగే వారపు సంతలో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మూడు, నాలుగు కేజీలుండే ప్యాకెట్ ధర రూ.500 పలుకుతుంది. కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

February 22, 2026 / 11:44 AM IST

పొన్నూరులో పరదాల చాటున మద్యం దందా..!

గుంటూరు: పొన్నూరులో పరదాల మాటున మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. జీబీసీ రోడ్డులో బాపట్ల బస్టాండ్, ఆటో స్టాండ్ సమీప వైన్స్ షాపుల్లో తెల్లవారుజామునే అమ్మకాలు సాగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులు, మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

February 22, 2026 / 11:43 AM IST

‘తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవు’

NLR: చేపల దుకాణాలలో తనిఖీలు నిర్వహించి తూకాలలో లోపాలు ఉన్న 15 కాంటాలను సీజ్ చేశామని తూనికుల అధికారి శాఖ ఇన్స్పెక్టర్ రియాజ్ అహ్మద్ తెలిపారు. తూనికలలో తేడాలు వస్తున్నాయని వినియోగదారుల ఫిర్యాదు మేరకు బుచ్చిరెడ్డిపాలెం చాపల దుకాణాలపై దాడులు చేశారు. చేతి కర్ర కాంటాలు వాడొద్దని వ్యాపారస్తులకు సూచించారు. కాంటాలు కొనుగోలు చేసేటప్పుడు సీలు వేయించుకుని లైసెన్సులు తీసుకోవాలన్నారు.

February 22, 2026 / 11:41 AM IST

గాజువాకలో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడు మృతి

VSP: గాజువాకలోని పెట్రోల్ బంక్ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. వేగంగా వచ్చిన భారీ వాహనం ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో, సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

February 22, 2026 / 11:40 AM IST