VZM: మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో 6 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్‌తో వీసీలో పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్, అయ్యప్పనగర్‌లోని ఏపీ మోడల్ స్కూల్, JNTU బ్లాక్ 1, 2 , ప్రభుత్వ బాలికల హై స్కూల్‌లలో నిర్వహించడం జరుగుతుందన్నారు.
గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. గురువారం అమరావతి, జీటీ రోడ్లలోని 47 ఆక్రమణలను అధికారులు తొలగించారు. ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరించారు. అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
E.G: ఏపీ శాసన మండలిలో శాసనమండలి BJP ప్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు చేయడం సిగ్గుచేటని బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయ గురువారం పేర్కొన్నారు. సీనియర్ సభ్యుడిపై ఇలాదాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్దమని విమర్శించారు. సభలో మహిళా మంత్రులు అని కూడా చూడకుండా వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
AKP: మాకవరపాలెం మండలం తూటిపాలలో ఇసుక తవ్వకాలను తహసీల్దార్ వెంకటరమణ గురువారం అడ్డుకున్నారు. ఈ గ్రామ శివారున ఉన్న సర్పానది నుంచి ఇసుక తరలింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకొని ఇసుక తవ్వుతున్న ఒక జేసీబీని స్వాదీనం చేసుకున్నారు. ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
E.G: ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఖ్యాతిగాంచిన కాణిపాకం స్వయంబు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల జనసేన సమన్వయకర్త వేగుళ్ళ లీలాకృష్ణ గురువారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
KRNL: వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కురువ శశికళ కృష్ణమోహన్ కుటుంబ సమేతంగా ఇవాళ మాజీ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. 2029 ఎన్నికల్లో వైసీపీకు విజయం సాధించేందుకు అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ATP: మార్చి 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే, ఫిబ్రవరి 28న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి నగదు అందజేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో 2,77,073 మందికి రూ.123.99 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
W.G. ఉండి, పాలకోడేరు ఎంపీడీవో కార్యాలయాలను కలెక్టర్ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూ.ఎఫ్.ఎస్ సర్వే, ఈ-కేవైసీ, పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. సర్వే ప్రక్రియ మందకొడిగా సాగడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
నెల్లూరు: ఇబ్రహీంపట్నం సమీపంలోని కొండపల్లి ప్రాంతంలో ఉన్న కొండపల్లి ఎన్విరొ టెక్ CETP ప్లాంట్‌ను రాష్ట్ర ఎన్విరాల్‌మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పరిశీలించారు. ప్లాంట్లో జరుగుతున్న కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల నుండి వస్తున్న వ్యర్థ జలాల శుద్ధి ప్రక్రియ నిర్వహణ విధానంపై ఆరా తీశారు.
ఉమ్మడి ప.గో.జిల్లాలో పాలు, పాల పదార్థాల కల్తీ యదేచ్ఛగా కొనసాగుతుందని ఆర్టీసీ జోన్ 2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఇటీవలే రాజమండ్రిలో కల్తీ పాలు పలువురి ప్రాణాలు తీసిన నేపథ్యంలో ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అధికారులు నిర్లక్ష్య వైఖరి మూలంగానే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కల్తీ పాలను తయారు చేస్తున్నారన్నారు.
SKLM: గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల విద్యార్థినులకు అవగాహన అవసరమని శక్తి టీం హెచ్‌సీ ఎం గిరిధర్ తెలిపారు. గురువారం పాతపట్నం మండలం పెద్దలోగిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలతో అవగాహన సదస్సు నిర్వహించారు. నేడు పలు ప్రాంతాలలో బాలికలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని ముందుగా గుర్తించేందుకు అవగాహన పరుచుకోవాలని ఆయన సూచించారు.
KDP: రాజంపేట మున్సిపాలిటీలో తాగునీటి నాణ్యతపై మున్సిపల్ కమిషనర్ లక్ష్మీనారాయణ అకస్మాత్ తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పలు నీటి సరఫరా కేంద్రాలను పరిశీలించిన కమిషనర్, నీరు ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వేసవికాలంలో నీటి కొరత లేదా నాణ్యత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ASR: జీకేవీధి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్య చేసిన కేసులో నిందితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.50వేల జరిమానా విధించినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ గురువారం తెలిపారు. ఈ కేసులో పాంగి రమేష్ అలియాస్ పోయి రమేష్‌ను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారన్నారు. పోక్సో ప్రత్యేక కోర్టు నిందితుడికి శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.
CTR: పుంగనూరు(M) కుదవపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యానికి CMRF ద్వారా మంజూరైన చెక్కులను నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అందజేశారు. కూటమి ప్రభుత్వం పేదల వైద్య ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగానే గురువారం పార్టీ కార్యాలయంలో రూ.1,44,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
PPM: మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. ఎస్.భాస్కరరావు సూచించారు. వేసవిలో డీహైడ్రేషన్ నివారించేందుకు తగినంత నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని తెలిపారు. సూర్యరశ్మి నుంచి రక్షణగా గొడుగు, టోపీ వాడాలని సూచించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు ఉంచాలన్నారు.