దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 80,749.26 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,409.25 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. తర్వాత కొనుగోళ్ల మద్దతుతో క్రమంగా కోలుకుంది. చివరకు 218 పాయింట్ల లాభంతో 81,224.75 వద్ద ముగిసింది. నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 24,854 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.84.06గా స్థిరపడింది.