జియో ఫైనాన్స్ యాప్ ద్వారా స్మార్ట్ గోల్డ్‌ని విడుదల చేసింది. కేవలం రూ.10ల కనీస పెట్టుబడితో కస్టమర్లు స్వచ్చమైన బంగారం కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. కస్టమర్లు డిజిటల్ ప్లాట్ ఫామ్ నుండి నేరుగా బంగారం కొనవచ్చు. ఆ బంగారాన్ని ఇంటి వద్దకే డెలివరీ చేస్తామని తెలిపింది. బంగారు నాణేలు, బంగారు ఆభరణాలకు బదులుగా తమ పెట్టుబడులను రీడీమ్ చేసువచ్చు. ఇప్పటికే ఫోన్ పే, పేటీఎంలలో ఈ సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే.