ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ధరలు పెంచింది. ఇకపై ప్రతి ఆర్డర్‌పై రూ.10 వసూలు చేయనుంది. ఇప్పటికే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. పండగ సీజన్లో సేవలు అందించేందుకు ప్లాట్‌ఫామ్ ధరలు పెంచినట్లు కంపెనీ తెలిపింది. తమ బిల్లులు చెల్లించేందుకు ఈ రుసుములు సాయపడతాయని పేర్కొంది. కాగా, ఇప్పటికే జొమాటో కూడా తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచిన విషయం తెలిసిందే.