Suzuki Access 125 : ప్రముఖ వాహన ఉత్పత్తుల సంస్థ సుజుకీ(Suzuki) నుంచి టాప్ సెల్లర్‌గా ఉన్న ద్విచక్ర వాహనం సుజుకీ యాక్సస్ 125. ఎప్పటికప్పుడు వాహనాలను సరికొత్తగా లాంఛ్ చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంటుంది. బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ అయిన యాక్సస్కి మరిన్ని హంగులద్ది మార్కెట్లోకి కొత్తగా విడుదల చేయనుంది. అది ఎప్పుడు? దాని ఫీచర్లు ఎలా ఉండనున్నాయి? తెలుసుకుందాం రండి.
కొత్తగా మార్కెట్లోకి రాబోయే సుజుకీ యాక్సస్ 125లో ముందు వైపు స్టోరేజ్ కాంపొనెంట్ యాడ్ కానుంది. అలాగే హీట్ షీల్డ్‌కి కొత్త డిజైన్ రానుంది. దీనితో పాటు రీ డిజైన్ చేసిన మడ్‌గార్డ్‌ను కూడా కొత్త యాక్సస్లో పొందుపరచనున్నారు. దీని సీట్ ప్రస్తుత వెర్షన్‌తో పోలిస్తే మరింత ఫ్లాట్‌గా ఉంటుంది. అలాగే హజార్డ్ లైట్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఇందులో ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న వెర్షన్లో ఉన్న ఇంజిన్నే కొత్త వెర్షన్లోనూ సంస్థ కొనసాగిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 2024 ద్వితీయార్ధంలో లేదా 2025 తొలినాళ్లల్లో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టొచ్చని అంచనాలు ఉన్నాయి. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడ లేదు. త్వరలోనే సంస్థ నుంచి అప్డేట్స్(Updates) వచ్చే అవకాశాలున్నాయి.