7 types of Gold investment in 2024: ETFs to mining stocks and more
Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరలు రెండూ కూడా శనివారం పెరిగాయి. బంగారం సాధారణంగా పెరగ్గా, వెండి మాత్రం భారీగా పెరిగింది. దేని ధర ఎంత పెరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర నేడు రూ.576 పెరిగింది. దీంతో ఇప్పుడు దీని ధర రూ.94,399కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం తదితర చోట్ల కూడా బంగారం ధరలు(Gold RateS) దాదాపుగా ఇలానే ఉన్నాయి. అయితే వినియోగదారులు నగల్ని కొనుక్కునేప్పుడు ఈ ధరకు అదనంగా జీఎస్టీ, మజూరీలనూ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం అంతా గుర్తు పెట్టుకోవాలి.
ఇక ఇక్కడ వెండి ధర(Silver Rate) మాత్రం భారీగా పెరిగాయి. ఈ ఒక్కరోజే రూ.13,89 పెరిగిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో శనివారం కేజీ వెండి ధర రూ.94,399గా నమోదయ్యింది. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం లాంటి చోట్ల సైతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ ధరలు మార్కెట్ మొదలయ్యే సమయంలో నమోదైనవి. తర్వాత మళ్లీ మారొచ్చు. ఈ విషయాన్ని కొనుగోలుదారులు దృష్టిలో ఉంచుకోవాలి.
అంతర్జాతీయ మార్కెట్లో సైతం ధరల పరిస్థితి అలాగే ఉంది. స్పాట్ గోల్డ్, వెండి ధరలు భారీగా పెరిగాయి. శనివారం ఒక్కరోజే ఔన్సు స్పాట్ గోల్డ్ ధర ఏకంగా 30 డాలర్లు పెరిగింది. దీంతో దీని ధర నేడు 2391 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 31.23 డాలర్లుగా ఉంది.