Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర భారీ పెరుగుదలను నమోదు చేసిందది. బుధవారం ఒక్కరోజే ఏకంగా రూ.919 పెరిగింది. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.70,915 ఉండగా, బుధవారం నాటికి రూ.71,834కు చేరుకుంది.
చదవండి : చిన్నాన్నను హత్య చేయించిన వాళ్లను జగనన్న వెనకేసుకొస్తున్నారు : షర్మిల
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.71,834గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
చదవండి : దిల్లీ సీఎంగా సునీతా కేజ్రీవాల్?
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) మంగళవారం రూ.78,294 ఉండగా, బుధవారం నాటికి రూ.1,835 పెరిగి రూ.80,129కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి భారీగా పెరగడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,252 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 33 డాలర్లు పెరిగి 2,285 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 26.41 డాలర్లుగా ఉంది.

