దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కారణంగా దిల్లీ ముఖ్యమంత్రి పదవిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారా? లేదంటే రాజీనామా చేస్తారా? ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆ పదవిలోకి వస్తారా? అన్నదానిపై చర్చ జరుగుతోంది.
Delhi Next CM Sunitha Kejriwal ? : మద్యం విధానానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తీహార్ జైలులో ఉన్న ఆయన అక్కడి నుంచే పాలన కొనసాగిస్తారా? లేదా రాజీనామా చేస్తారా? అన్న విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒక వేళ ముఖ్యమంత్రి(CM) పదవికి ఆయన రాజీనామా చేస్తే ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆ పదవిని చేపట్టబోతారని వార్తలు వెలువడుతున్నాయి.
దిల్లీ సీఎం రేసులో మొదటగా వినిపిస్తున్న పేరు సునీతా కేజ్రీవాల్‌దే(Sunitha Kejriwal). ఇప్పటి వరకు ఆమె రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే కేజ్రీవాల్ అరెస్టుతో ఆమె పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఆమె భర్త తరఫున మాట్లాడుతూ బీజేపీపై విమర్శలూ చేస్తున్నారు. దీంతో ఆమె సీఎంగా బాధ్యతలు చేపడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే నిజం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఆప్‌లో ముఖ్య నేతలుగా ఉన్న మనీష్ సిసోదియా, సత్యేందర్ జైన్లు కూడా జైల్లో ఉన్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ సునీతా కేజ్రీవాల్ పైనే ఉంది. సునీతా కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారిణిగా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ చేశారు. ఉన్నత చదువులు చదివారు. ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొన్నారు. ఆమెకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. దీంతో ఆమె ముఖ్యమంత్రిగా పదవి తీసుకుంటారని అంతా భావిస్తున్నారు. 55 మంది ఆప్ ఎమ్మెల్యేలు మంగళవారం సునీతా కేజ్రీవాల్‌ని కలిశారు. అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నా సరే దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడపాలని తెలిపారు. భవిష్యత్తులో మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.