Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర బుధవారం రూ.67,742 ఉండగా, గురువారం నాటికి రూ.1,143 పెరిగి రూ.68,885కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.68,885గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) బుధవారం రూ.76,326 ఉండగా, గురువారం నాటికి రూ.1,144 పెరిగి రూ.77,470కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి రూ.1000 పైనే పెరగడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర సైతం భారీగా పెరిగింది. ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర బుధవారం 2159 డాలర్లు ఉండగా గురువారం నాటికి 44 డాలర్లు పెరిగి 2203కు చేరుకుంది. ఇక ప్రస్తుతం ఔన్సు వెండి ధర ప్రస్తుతం 25.64 డాలర్లుగా ఉంది.