»Delhi High Court Reserve Order On Plea Of 2000 Note Exchange Without Any Proof
2000 rupee notes: రూ.2వేల నోట్ల రద్దుపై ఢిల్లీ హైకోర్టులో పిటీషన్
రూ.2వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, గుర్తింపు కోసం తగిన రుజువు చూపించడకుండానే రూ. 2,000 నోట్ల మార్పిడిని ఆర్బీఐ అనుమతించిందని ఈ పిల్ లో పేర్కొన్నారు.
2000 rupee notes: రూ.2వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ(RBI) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టు(Delhi High court)లో పిల్ దాఖలైంది. ఎలాంటి రిక్విజిషన్ స్లిప్, గుర్తింపు కోసం తగిన రుజువు చూపించడకుండానే రూ. 2,000 నోట్ల మార్పిడిని ఆర్బీఐ అనుమతించిందని ఈ పిల్(PIL) లో పేర్కొన్నారు. అంతేకాదు.. మే 19న ఆర్బీఐ నోటిఫికేషన్(Notifocation), మే 20న ఎస్బీఐ(SBI) నోటిఫికేషన్లు ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉన్నాయని లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 19న రూ.2,000 నోట్లను చెలామణిని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు రెండు వేల నోట్లను బ్యాంక్ లో తిరిగి సమర్పించడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది.
ఢిల్లీ న్యాయవాది, బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పును రిజర్వ్ చేసింది. అశ్విని ఉపాధ్యాయ్ తన పిటిషన్లో, ఎటువంటి గుర్తింపు లేదా రుజువు లేకుండా ప్రజలు 2000 నోట్లను మార్చుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నోటిఫికేషన్‌ను సవాలు చేశారు. ఆర్బిఐ మొత్తం నోటిఫికేషన్‌ను తాను సవాలు చేయడం లేదని, అయితే గుర్తింపు లేకుండా నోట్‌ను మార్చడానికి మాత్రమే అభ్యంతరం ఉందని అశ్విని ఉపాధ్యాయ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అతను దానిని ఏకపక్షంగా, అహేతుకంగా రద్దు చేయవలసిందిగా కోర్టును కోరారు.
ప్రస్తుతం దేశంలోని ప్రతి ఇంటికీ ఆధార్ ఉందని, దాదాపు అన్ని కుటుంబాలకు బ్యాంకు ఖాతా ఉందని చెప్పారు. అలాంటప్పుడు ID లేకుండా 2000 నోట్లను ఎందుకు మార్చుకుంటున్నారు. నోట్ల మార్పిడికి స్లిప్ ఇవ్వనప్పుడు, ఇది సమస్యలను సృష్టించవచ్చని భావించారు. ఆర్బిఐ నోటిఫికేషన్లో రూ. 20,000 ఒకేసారి మార్చుకోవచ్చు. ప్రతిసారి రూ. 20,000 విలువైన 2000 నోట్లను మార్చుకోవడానికి ఒక వ్యక్తి రోజుకు అనేకసార్లు బ్యాంకుకు వెళ్లవచ్చు.
చలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల మొత్తం విలువ రూ.6.73 లక్షల కోట్ల నుంచి 3.62 లక్షల కోట్లకు తగ్గిందని, అంటే రూ.3.11 లక్షల కోట్లు వ్యక్తుల లాకర్లలోకి చేరాయని, లేదంటే వేర్పాటువాదులు నిల్వ చేశారని ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఉగ్రవాదులు, మావోయిస్టులు, డ్రగ్ స్మగ్లర్లు, మైనింగ్ మాఫియాలు, అవినీతిపరుల వద్ద రెండు వేల నోట్లు ఉన్నాయన్నారు లాయర్ అశ్విని ఉపాధ్యాయ్. ఈ విధంగా నక్సలైట్లు, ఉగ్రవాదులు కూడా తమ డబ్బును మార్చుకోవచ్చని అశ్విని ఉపాధ్యాయ్ అన్నారు. అదే సమయంలో, హింస చెలరేగుతున్న ఈశాన్య ప్రాంతంలో ప్రజలు తమ డబ్బును మార్చుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ లోనే అతిక్ అహ్మద్ అనుచరులు బ్యాంకుకు వెళ్లి తమ నోట్లను మార్చుకోవచ్చు. అయితే మంగళవారం విచారణ అనంతరం ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది.