ఈ ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో ఇంటి భోజనం తయారీ సగటు ఖర్చులు పెరిగాయి. శాకాహార భోజనం 6%, మాంసాహార భోజనం 4% మేర ప్రియం అయ్యాయని క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. సెప్టెంబరులో శాకాహార భోజనం ప్లేటు ధర రూ.31.30 ఉండగా.. అక్టోబరులో 33.30కు చేరింది. 2023 ఇదే నెలతో పోల్చితే, అక్టోబరులో శాకాహార భోజనం ఖర్చు 20% పెరిగింది. కూరగాయల ధరలు పెరగడం ఇందుకు కారణమైంది.