ప్రైవేటురంగ టెలికాం కంపెనీ VI ప్రీపెయిడ్ యూజర్ల కోసం సూపర్ హీరో ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా అర్ధరాత్రి 12 నుంచి మ. 12 గంటల వరకు ఉచిత అపరిమిత డేటా పొందవచ్చు. ప్రస్తుతం రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉచిత డేటా ఇస్తోంది. ఇకపై అదనంగా ఆరు గంటల పాటు ఈ ప్లాన్ అమలు చేయనుంది. రూ.365పైబడి రీఛార్జ్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.