»Anil Ambani Gets Rs 922 Crore Gst Tax Show Cause Notice For Reliance Capital General Insurance
Anil Ambani: రూ.922కోట్ల పన్ను ఎగవేత కేసులో అనిల్ అంబానీకి నోటీసులు
అనిల్ అంబానీకి పెద్ద దెబ్బ తగిలింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆయనను రూ.922కోట్లు పన్ను ఎగవేతకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. GST ఎగవేత, బకాయిలపై నిఘా ఉంచిన DGGI(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ ) అనిల్ అంబానీకి 4 వేర్వేరు నోటీసులు పంపింది. రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన లావాదేవీలపై వారికి ఈ నోటీసులు అందాయి.
Anil Ambani: అనిల్ అంబానీకి పెద్ద దెబ్బ తగిలింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆయనను రూ.922కోట్లు పన్ను ఎగవేతకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. GST ఎగవేత, బకాయిలపై నిఘా ఉంచిన DGGI(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ ) అనిల్ అంబానీకి 4 వేర్వేరు నోటీసులు పంపింది. రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన లావాదేవీలపై వారికి ఈ నోటీసులు అందాయి. రీ-ఇన్సూరెన్స్ కమీషన్, కో-ఇన్సూరెన్స్ ప్రీమియంపై జిఎస్టికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్‌జిఐసి)కి నోటీసు పంపింది. దీనితో పాటు అనిల్ అంబానీకి చెందిన ఈ బీమా కంపెనీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను సద్వినియోగం చేసుకుంది. రీ-ఇన్సూరెన్స్ సేవలను దిగుమతి చేసుకుంది. కానీ దానిపై GST చెల్లించలేదు. దీనికి సంబంధించి నోటీసు కూడా పంపారు.
అనిల్ అంబానీకి డీజీజీఐ 4 నోటీసులు పంపినట్లు వార్తా సంస్థ పీటీఐ వర్గాలు తెలిపాయి. ఇందులో జీఎస్టీ బకాయిలు రూ.478.84 కోట్లు, రూ.359.70 కోట్లు, రూ.78.66 కోట్లు, రూ.5.38 కోట్లు కట్టాలని ఉంది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తన త్రైమాసిక ఫలితాల్లో ఈ సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ ప్రస్తుతం NCLT చర్యను ఎదుర్కొంటోంది. కంపెనీకి భారీ రుణ భారం ఉంది. రిలయన్స్ క్యాపిటల్ అతిపెద్ద యూనిట్ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్. రిలయన్స్ క్యాపిటల్ విలువలో 70 శాతం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ దే. ఇప్పటికే అనిల్ అంబానీ చాలా కాలంగా కష్టాల్లో ఉన్నారు. గతసారి తన టెలికాం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన కేసులో రూ.500 కోట్లకు పైగా చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. అలా చేయకుంటే జైలుకు వెళ్లే తరుణంలో అన్నయ్య ముఖేష్ అంబానీ సాయం చేసేందుకు ముందుకొచ్చారు.