ఇటీవల ‘బీఈ 6ఈ’ పేరిట ఓ విద్యుత్ కారును మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ‘6ఈ’ కోడ్ను తన విమాన సేవలకు వినియోగిస్తుండటంతో.. ట్రేడ్మార్క్ ఉల్లంఘన జరిగిందంటూ మహీంద్రాపై ఢిల్లీ హైకోర్టులో ఇండిగో కేసు వేసింది. దీంతో ఆ కారు పేరును ‘బీఈ 6’ మార్చాలని నిర్ణయించినట్లు మహీంద్రా సంస్థ పేర్కొంది. అయితే, ‘బీఈ 6ఈ’పై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపింది.