TG: రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మండలానికి ఒక మండల విద్యాశాఖ అధికారిని నియమించింది. 609 మండలాలకు ఇన్ఛార్జ్ ఎంఈవోలను నియమించింది. మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 632 మండలాలకు గానూ అందులో 16 మండలాల్లో రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు.