అన్నమయ్య: రాయచోటి పట్టణం ఠాణా సమీపంలో అజంతా ఎలక్ట్రికల్ షాపులో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. అప్పటికే సుమారు రూ.40లక్షల నుండి రూ.50లక్షల వరకు సామాగ్రి అగ్నికి ఆహుతి అయింది. షాప్ యజమానితో పాటు గుమస్తాలు కూడా నమాజ్కి వెళ్లడం వల్ల ఎలంటి ప్రాణనష్టం జరగలేదు.