ప్రకాశం: దొనకొండ మండలంలోని కంచర్లకోట గ్రామ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న మహిళపై నుండి సిమెంట్ లారీ దూసుకెల్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళకు రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను స్థానికులు ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.