జనగాం: పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీను ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. దీంతో పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీను మృతికి పోలీసుల కారణమని బాధిత కుటుంబ సభ్యులన్నారు.