అసోంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మణిపూర్-అసోం సరిహద్దుల మధ్య అసోం పోలీస్ టాస్క్‌ఫోర్స్ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో రూ.6 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్‌ను గువహటిలోని ముర్తజా అహ్మద్ అలియాస్ భూలు వద్దకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో తరలిస్తున్న 637 గ్రా. హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.6 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.