»Yes Bank Shares At Minimum Of Seven Months Rbi 3 Years Lock In Time Is Over
Yes Bank: ఏడు నెలల కనిష్టానికి Yes బ్యాంక్ షేర్లు..లాక్-ఇన్ టైం పూర్తి
భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) నిర్దేశించిన మూడేళ్ల లాక్-ఇన్(lock-in time) వ్యవధి ముగిసిన తర్వాత యెస్ బ్యాంక్ షేర్లు దాదాపు 12.75% క్షీణించాయి. ఏడేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ బ్యాంక్ షేర్లు 15.85 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
యెస్ బ్యాంక్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇచ్చిన లాక్-ఇన్ పీరియడ్ గడువు మార్చి 13తో ముగియనుంది. దీంతో వారు సెకండరీ మార్కెట్లో తమ షేర్లను విక్రయించడానికి అనుమతించారు. ఈ క్రమంలో షేర్ల అమ్మకాల ఒత్తిడి కొనసాగనుందని నిపుణులు అంచనా వేశారు. దీంతో మార్కెట్ మొదలైన వెంటనే యెస్ బ్యాంక్ షేర్లు(Yes Bank shares) క్షీణించి ఏడు నెలల కనిష్టానికి పడిపోయాయి. దాదాపు మూడు సంవత్సరాలలో వారి అతిపెద్ద ఇంట్రాడే(intraday) క్షీణతను నమోదు చేశాయి. తర్వాత క్రమంగా కోలుకుని 15.85 రూపాయల వద్ద ట్రేడవుతున్నాయి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్చి 2020లో పునర్వ్యవస్థీకరణలో భాగంగా యెస్ బ్యాంకు(yes bank)లో ఎస్బీఐ(SBI) సహా ఇతర బ్యాంకులు 49 శాతం వాటాను కొనుగోలు చేశాయి. రెండు రూపాయల విలువ గల ఒక్కో షేరును 10 రూపాయలకు తీసుకున్నాయి. వాటిలో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్ప్, ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యెస్ బ్యాంక్లో 1% నుంచి 4.34% వరకు వాటాలను కలిగి ఉన్నాయి. పునర్నిర్మాణం నుంచి యెస్ బ్యాంక్ షేర్లు 50% కంటే ఎక్కువ పడిపోయాయి. జనవరిలో త్రైమాసిక లాభంలో రుణదాత 80% తగ్గుదలని రుణదాత నివేదించిన తర్వాత ఈ సంవత్సరం 20% తగ్గిపోయాయి.
అయితే రిటైల్, హెచ్ఎన్ఐలు(HNI), ఎన్ఆర్ఐలు(NRis) సహా మదుపర్ల వద్ద 135 కోట్ల యెస్ బ్యాంక్ షేర్లు(Yes Bank shares) లాక్-ఇన్(lock-in time) గడువులో ఉన్నాయి. దీంతోపాటు మరో 6.7 కోట్ల షేర్లు ఈటీఎఫ్ ల వద్ద ఉన్నాయి. అయితే లాక్-ఇన్ గడువు ముగిసిన నేపథ్యంలో ఆయా షేర్లను వారు విక్రయించవచ్చని పలువురు నిపుణులు పేర్కొన్నారు. ఇప్పుడు కాకపోయినా మరికొన్ని రోజుల్లోనైనా యెస్ బ్యాంక్ షేర్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.