»Star Hero Sai Kumar Son Aadi Who Went Into Depression
Aadi Sai Kumar: డిప్రెషన్ లోకి వెళ్లిన స్టార్ హీరో కుమారుడు?
ప్రముఖ హీరో సాయి కుమార్(sai kumar) కొడుకు ఆది(Aadi sai kumar) తన సినిమాలు ఆడటం లేదని డిప్రెషన్(depression)లోకి వెళ్లారా? వరుసగా తన చిత్రాలకు కలెక్షన్లు రావడం లేదని బ్లాక్ జోన్ లోకి వెళ్లారా? అందేటో తెలియాలంటే ఈ వార్తను చదివేయండి మీకే తెలుస్తుంది.
ప్రముఖ నటుడు సాయి కుమార్(Sai Kumar) కుమారుడు ఆది(Aadi sai kumar).. డిప్రెషన్(depression)లోకి వెళ్లారా? అసలు తన సినిమాలు ఆడటం లేదనే బాధతో ఉంటున్నారా? సినిమా(movie) షూటింగులకు సమయానికి వచ్చే ఇతను లేటుగా వస్తున్నారా? అప్పుడే ఈ హీరో డేంజర్ జోన్ లోకి వెళ్లారా? అంటే ఇవన్నీ ప్రశ్నలను ఓ యాంకర్ అడుగగా.. ఈ హీరో చెప్పిన అన్సార్ ఎంటో ఇప్పుడు చుద్దాం.
అయితే ప్రస్తుతానికైతే అలాంటిది ఏమి లేదని హీరో ఆది సాయి కుమార్(Aadi) చెబుతున్నారు. నా చిత్రాలు మాత్రమే కాదు అనేక మంది హీరోలకు హిట్టులు లేక చాలు రోజులవుతుందని గుర్తు చేశారు. తాము కొత్తగా కథలను ఎంచుకుంటూ తమ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. కానీ కొన్ని సార్లు సినిమాల్లో(movies) పోటీ, హీరోల మధ్య పోటీ సహా అనేక కారణాల వల్ల ఆయా చిత్రాలు ఆడకపోవచ్చని అన్నారు. ప్రతి ఒక్క హీరోకు ఏదో ఒకరోజు హిట్టు(hit) మాత్రం తప్పకుండా వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు బాలీవుడ్లో మొన్నటి వరకు పఠాన్(pathan) చిత్రం విడుదల కాకముందు అన్ని చిత్రాలు ప్లాప్(flop)అయిన సందర్భాన్ని గుర్తు చేశారు. ఇంకోవైపు స్టార్ హీరో అక్షయ్ కుమార్ చిత్రాలు కూడా వరుసగా ఆడటం లేదన్నారు. దీంతోపాటు అక్కడ కూడా అనేక మంది హీరోల చిత్రాలు హిట్టు కావడం లేదని తెలిపారు. ఇలా ప్రతి ఇండస్ట్రీలో కూడా హిట్టు ప్లాపులు సాధారణం అని వెల్లడించారు. ఆది యాక్ట్ చేసిన CSI Sanatan మూవీ మార్చి 10న విడుదలై యావరేట్ టాక్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఇలాంటివి సాధారణమని చెప్పారు. మరోవైపు ప్రస్తుతం జంగిల్, Kirathaka వంటి సినిమా ప్రాజెక్టులు చేస్తున్నట్లు వెల్లడించారు.
కానీ ఓ సందర్భంలో మాత్రం తాను బాధ పడినట్లు ఆది తెలిపారు. తన చిత్రం బుర్రకథ చిత్రం విడుదలకు ముందు అలా జరిగినట్లు పేర్కొన్నాడు. ఆ సమయంలో కలెక్షన్లు(collections) రాబట్టడంలో ఫెయిల్(fial) కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. సినిమాలకు ఎప్పటికైనా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను. నా ఇంటికి కూడా తాళం వేసుకున్నాను. ప్రజలకు నా ముఖం చూపించడానికి బయటకు రావాలని కూడా అనిపించలేదని ఆది చెప్పాడు. కానీ ఆ దశ నుంచి తాను బయటపడేందుకు తనకు అండగా భార్య అరుణ నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం తన కెరీర్ రూపొందుతున్న విధానంతో పర్వాలేదని చెప్పుకొచ్చారు.