తన కొడుకు బీజేపీలో చేరడం (Anil K Antony joined the BJP) తనను ఎంతో బాధించిందని, అతను తీసుకున్న నిర్ణయం తప్పు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (congress senior leader AK Antony) అన్నారు. తన కుమారుడిలా తాను పార్టీ మారబోనని చెప్పారు. ఇప్పుడు తన వయస్సు 82 అని, జీవిత చరమాంకంలో ఉన్న తాను మరో దారిని ఎంచుకోలేనని అభిప్రాయపడ్డారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ తోనే ఉంటానని చెప్పారు. ఆయన బీజేపీ (bjp) మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌకికవాదం పైనే (secularism) దేశ ఐక్యత ఆధారపడి ఉందని చెప్పారు. 2014 నుంచి దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో నెమ్మదిగా మొదలైన ఈ ప్రక్రియ 2019 నుంచి వేగం పుంజుకున్నదని చెప్పారు.
అనిల్ ఆంటోనీ గురువారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (piyush goyal), కేరళ బీజేపీ చీఫ్ వీ మురళీధరన్ (muralidharan) సమక్షంలో బీజేపీలో (bjp) చేరిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలోనే కాంగ్రెస్కు, పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. బీజేపీలో చేరడంపై అనిల్ (anil antony) స్పందిస్తూ… చాలామంది కాంగ్రెస్ నేతలు తాము ఓ ఫ్యామిలీకి డ్యూటీ చేయడమే ప్రజలకు సేవ చేయడంగా భావిస్తారని, నేను ప్రజలకు సేవ చేయాలనుకొని పార్టీలో చేరినట్లు చెప్పారు. మోడీకి వచ్చే పాతికేళ్ల వరకు దేశ నిర్మాణం విషయంలో మంచి విజన్ ఉందన్నారు. నేను సరైన మార్గాన్నే ఎంచుకున్నానని, నాకు తెలిసినంత వరకు నా తండ్రి ఏకే ఆంటోనీ కూడా నా అభిప్రాయాన్ని గౌరవించాలన్నారు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ, తాను బీజేపీ దేశానికి చేస్తున్న సేవ చూసి చేరినట్లు చెప్పారు.
ప్రధాని మోడీపై (pm narendra modi) బీబీసీ తీసిన డాక్యుమెంటరీని (bbc documentary on modi) అనిల్ (anil antony) అప్పట్లో ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఈ అంశం కాంగ్రెస్ పార్టీలో (congress party దుమారం రేపింది. తాను చేసిన ట్వీట్ వెనక్కి తీసుకోనని.. జనవరిలోనే పార్టీ పదవులకు రాజీనామా చేశారు. డాక్యుమెంటరీని మన దేశంలో ప్రమోట్ చేయడాన్ని అనిల్ తప్పుపట్టారు. తమకు బీజేపీతో (bjp) విభేదాలు ఉన్నప్పటికీ, భారతదేశంపై బీబీసీ వ్యక్తం చేసిన అభిప్రాయం సరికాదన్నారు. ట్వీట్ చేసిన సమయంలో అనిల్ కేరళ కాంగ్రెస్ డిజిటల్ మీడియా ఇంచార్జీగా (kerala congress digital media incharge) ఉన్నారు అనిల్. సొంత పార్టీలోనే విమర్శలు రావడం, ట్వీట్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు రావడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. భావ ప్రకటన స్వేచ్చ కోసం పోరాడుతున్న నేతలు.. ట్వీట్ తొలగించాలని కోరడం బాగాలేదని, కాంగ్రెస్ పార్టీలో (congress party) వంతపాడేవారు ఎక్కువ అయ్యారని అప్పుడే విమర్శలు గుప్పించారు.