Ram Charan : వైరల్ పిక్స్.. అమెరికాకు వెళ్లిన చరణ్, ఎందుకంటే!
Ram Charan : ఈసారి ఆస్కార్ నామినేషన్లో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట.. గోల్డేన్ గ్లోబ్ అవార్డ్ సైతం దక్కించుకుంది.
ఈసారి ఆస్కార్ నామినేషన్లో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట.. గోల్డేన్ గ్లోబ్ అవార్డ్ సైతం దక్కించుకుంది. దాంతో నెక్స్ట్ ఆస్కార్ అoదుకోవడమే ఆలస్యం అంటున్నారు. మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అమెరికా వెళ్లనున్నారు. ఇప్పటికే లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఆస్కార్ లంచ్ కార్యక్రమానికి కీరవాణి, చంద్రబోస్ హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆస్కార్ వేడుక కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అమెరికాకి వెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో చరణ్‌కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవలె ఆర్సీ 15 ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు చరణ్. ఇక శంకర్.. ఇండియన్ 2 మొదలు పెట్టడంతో.. కాస్త ముందుగానే ఫారిన్ ట్రిప్ వేసేశాడు. దాంతో ఈసారి చరణ్ కాస్త లాంగ్ టూర్ వేసినట్టేనని చెప్పాలి. అక్కడ ఆస్కార్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. అంతేకాదు.. ఈ టూర్ రామ్ చరణ్ గ్లోబల్ మార్కెట్‌ను మరింతగా పెంచనుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ సైతం చరణ్ పై ప్రశంసలు కురిపించాడు. అందుకే ఆస్కార్ టూర్ చరణ్‌కు మరింత ప్లస్ అవనుందని చెప్పొచ్చు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి కూడా.. అతి త్వరలోనే యూస్ ఫ్లైట్ ఎక్కనున్నారు. ఏదేమైనా చరిత్ర సృష్టించేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్న రాజమౌళి.. హిస్టరీ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.