హీరో రాం చరణ్ పై తన భార్య ఉపాసన రివేంజ్ తీర్చుకుందా. ఈ వీడియో చూస్తే మాత్రం అచ్చం అలాగే అనిపిస్తుంది. కానీ అసలు విషయం తెలియాంటే ఈ స్టోరీని ఓసారి చదవండి.
హీరో రాం చరణ్(ram charan)పై తన భార్య ఉపాసన రివేంజ్ తీర్చుకుందా? అంటే ఈ వీడియో చూస్తే మాత్రం అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకకు హాజరైన రాంచరణ్(ram charan), ఉపాసన(Upasana), సాయి ధరమ్ తేజ్(sai dharam tej) అనుకోకుండా ఒకే సోఫాలో కూర్చుంటారు. ఆ క్రమంలో ముగ్గురికి సోఫాలో ఇబ్బందిగా అనిపించడంతో ఉపాసనను చెర్రీ పక్క సోఫాలో కూర్చోమని సైగ చేస్తాడు. తర్వాత ఉపాసన కొంచెం ఇబ్బందిగా ఫిలై పక్క సోఫాలోకి మారుతుంది. ఆ క్రమంలో చరణ్, సాయి ధరమ్ తేజ్ నవ్వు కోవడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ అయింది.
కానీ ఆ తర్వాత రోజు చెర్రీపై తనును సీటు మారమన్నందుకు ఉపాసన(Upasana) పలు రకాల పనులు చేయించి బదులు తీర్చుకున్నట్లు వీడియో చూస్తే అనిపిస్తుంది. ఆ క్రమంలో చెర్రీ బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం, ఇళ్లు తుడవడం, చెట్లకు నీళ్లు పోయడం, కాఫీ పెట్టడం వంటి రకరకాలు పనులు చెర్రీ చేయడం వీడియోలో చూడవచ్చు. అసలు విషయం ఏంటంటే రాం చరణ్ లాక్ డౌన్ సమయంలోనే ఈ పనులన్నీ చేశారు. కానీ ఓ నెటిజన్ ఫన్నీగా ఈ వీడియోను ఎడిట్ చేసి వైయిట్ ఫర్ ఉపాసన రివేంజ్(upasana revange) అని నెట్టింట ఇటీవల పోస్ట్ చేయగా..ఇది చూసిన ఉపాసన తన ఇన్ స్టా స్టోరీల్లో షేర్ చేస్తూ స్మైలీ ఎమోజీలను జత చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో తెగ వైరల్ అవుతుంది.