»Unesco Recognition For The Most Amazing Signature In The World Clarity
UNESCO: ప్రపంచంలో అత్యంత అద్భుత సంతకానికి యునెస్కో గుర్తింపు..క్లారిటీ
యునెస్కో కర్ణాటకలోని హొన్నావర్(Honnavar) టౌన్ సబ్ రిజిస్ట్రార్(sub registrar officer) ఈ సంతకాన్ని ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన సంతకంగా గుర్తించలేదని తేలింది. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వార్త నిజం కాదని ఫాక్ట్ చెక్ వెబ్ సైట్ వెల్లడించింది. యునెస్కో(UNESCO) ఉత్తమ సంతకానికి ఎలాంటి గుర్తింపు లేదా అవార్డు ఇవ్వదని స్పష్టం చేసింది.
ఇటీవల సోషల్ మీడియాలో ఓ సంతకానికి(signature) సంబంధించిన వార్త తెగ వైరల్ అయ్యింది. కర్ణాటక(karnataka)లోని హొన్నావర్(Honnavar) టౌన్ సబ్ రిజిస్ట్రార్ చేసిన సైన్ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన సంతకంగా యునెస్కో గుర్తించిందని ప్రచారం జరిగింది. కానీ ఆ వార్త నిజం కాదని ఫక్ట్ చెక్(fact check) వెబ్ సైట్ తాజాగా ప్రకటించింది. యునెస్కో(UNESCO) సంతకానికి సంబంధించి ఎలాంటి గుర్తింపు లేదా అవార్డు ఇవ్వదని వెల్లడించింది.
అంతేకాదు ప్రపంచంలోనే అత్యుత్తమ సంతకాన్ని UNESCO ఎప్పుడైనా గుర్తించిందా అని శోధించినప్పుడు గతంలో కూడా అలాంటి గుర్తింపు ఎవ్వరికి ఇవ్వలేదని తెలిపింది. దీంతోపాటు యునెస్కో వెబ్సైట్లో కీవర్డ్‌లతో తనిఖీ చేసినప్పుడు హొన్నావర్ సబ్-రిజిస్ట్రార్ సంతకానికి సంబంధించిన ఫలితాలు ఏమీ కనబడలేదని చెప్పింది. మరోవైపు సంతకం స్క్రీన్‌షాట్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో సైతం వెతికినా కనిపించలేదని స్పష్టం చేశారు.
దీంతోపాటు ఈ విషయం గురించి సబ్ రిజిస్ట్రార్(sub registrar officer) శాంతయ్యను కూడా సంప్రదించినట్లు తెలిపారు. కానీ యునెస్కో(UNESCO) నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని, అది నిజమైతే, దాని గురించి తెలియజేయాలని అతను చెప్పినట్లు వెల్లడించారు. ఈ విషయమై యునెస్కో ఇంగ్లీష్ ఎడిటర్ రోని అమెలన్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించామని.. ఆమె నుంచి స్పందన వచ్చిన వెంటనే ఈ ఫ్యాక్ట్ చెక్ ద్వారా అప్డేట్ చేయబడినట్లు చెప్పారు. మొత్తంగా కర్ణాటక సబ్ రిజిస్ట్రార్ కళాత్మక సంతకం యునెస్కో ద్వారా ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన సంతకంగా గుర్తించబడలేదని తేలిపోయింది.
అయితే అసలు అతని సంతకానికి ఎందుకు అంత ప్రత్యేకత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సబ్ రిజిస్ట్రార్(sub registrar officer) శాంతయ్య సంతకం చేసే విధానం చాలా కొత్తగా ఉంటుంది. పలురకాల వంకరాలతోపాటు స్పెషల్ స్ట్రోక్స్ అతని సంతకంలో ఉంటాయి. దీంతోపాటు అతను వినూత్నంగా చేసే సంతకాన్ని ఎవరూ కూడా ఫోర్జరీ చేయలేము అన్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ఆ సంతకాన్ని యునెస్కో గుర్తించిందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.