»Tspsc Paper Leak Prime Accused Renuka And Her Husband Dismissed From Their Jobs
TSPSC పేపర్ లీకేజీ కేసు..రేణుక భర్తపై ప్రభుత్వం వేటు
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రశ్నాపత్రం లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులు ఇప్పటి వరకూ 9 మంది నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తుండటం తెలిసిందే. ప్రధాన నింధితులైన రాజశేఖర్, ప్రవీణ్, రేణుక(Renuka)ను అధికారులు విడివిడిగా విచారించారు. అధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. రాజశేఖర్(Rajasekhar) ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని తేలింది.

రాజశేఖర్ కంప్యూటర్ల పాస్వర్డులు తెలుసుకుని, అందులోని ప్రశ్నాపత్రాలను కాపీ చేసి ప్రవీణ్ ఇచ్చేవాడని విచారణలో తేలింది. వాటిని ప్రవీణ్ రేణుక(Renuka)కు ఇవ్వగా, తన దగ్గర పేపర్లున్నాయని రేణుక అభ్యర్థులను ఆకర్షించి డీల్ మాట్లాడినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. రేణుక నుంచి ఈ దందా నడిచినట్లు అధికారులు గుర్తించారు.
ప్రధాన నిందితురాలుగా రేణుక(Renuka)ను, ఆమె భర్త డాక్యా నాయక్(Dakya Naik)లను అధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారు. రేణుక వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం బుద్ధారం బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తుండగా ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపోతే రేణుక భర్త డాక్యా నాయక్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపిడిఓ ఆఫీస్ లో ఉపాధి హామీలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా ఆయన్ను విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్(Suspend) చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.