ఏపీలోని బాపట్ల సూర్యలంక బీచులో ఘోర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానం కోసం వెళ్లిన యువకుల్లో నీట మునిగి ముగ్గురు మృతి చెందగా..మరో నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరిని గజ ఇతగాళ్లు రక్షించగా..మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ యువకులందరూ విజయవాడకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.