»This Dog Walker Clicked The Best Group Portrait Of 10 Furry Friends In San Francisco
Viral News: ఫొటోలకు కిర్రాక్ స్టిల్ ఇచ్చిన డాగ్స్
ఫొటోలకు ఫోజులివ్వమంటే మనుషులే సరిగ్గా వినిపించూకోరు. అలాంటిది కుక్కలు ఫొటోలకు అందంగా ఫోజులివ్వడం అంటే మాములు విషయం కాదు. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం అమెరికాలో జరిగింది.
ఫోటోలకు కుక్కలు ఫోజులు ఇవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటి అరుదైన ఘటనను ఓ వ్యక్తి సాధించాడు. పైగా చిన్న సైజు నుంచి పెద్ద సైజు కుక్కలు ఎత్తు ఆధారంగా పక్కపక్కన నిల్చున్నాయి. USA అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ డాగ్-వాకర్ Dog-Walker దీన్ని సాధించాడు. జాషువా J. హర్స్మాన్ (dog-walker named Joshua J. Hursman) అనే వ్యక్తి తాను గ్రూప్ పోర్ట్రెయిట్ కోసం నడుచుకుంటూ వీధుల వెంబడి వెళ్తుండగా కుక్కలను సేకరించినట్లు చెప్పారు. వాటిని ఒకే దగ్గర చేర్చి ఫొటో తీసినట్లు తెలిపారు.
ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌ను వుయ్ రేట్ డాగ్స్ అనే పేజీ ట్విట్టర్లో షేర్ చేసింది. పోస్ట్‌లో 10 కుక్కల సమూహంతో కూడిన ఫొటో ఉంది. అవి వాటి ఎత్తుల ప్రకారం నిలబడి ఉన్నాయి. ఈ చిత్రం శాన్ ఫ్రాన్సిస్కో వీధుల్లో తీయబడింది. తప్పకుండా ప్రతీ ఒక్కరిని అలరిస్తుందని ఫొటో గ్రాఫర్ ఈ చిత్రంపై ధీమా వ్యక్తం చేశాడు.
“ఈ కుక్కలు వాటి ఫొటోను తీసేటప్పుడు నిజాన్ని గ్రహించాయి. అయినా అవి చాలా బాగా సహరించాయి. వారి వాకర్ చాలా గర్వంగా ఉంది . అందరికీ 14/10 మార్కులు” అని జాషువా తెలిపారు. ఈ ఫోటోపై నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఫొటోలో ఉన్న క్యూట్ నెస్ ను ఆస్వాదించకుండా ఉండలేరని పలువురు అంటున్నారు. “ఇది నా జీవితంలో నేను చూసిన అందమైన విషయం” అని ఒక నెటిజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరొకరు, “మీరు స్వర్గంలోకి ప్రవేశించినప్పుడు ఇది మిమ్మల్ని పలకరిస్తుంది” అని వ్యాఖ్యానించారు. ఇంతలో, జాషువా ఇన్స్టాగ్రామ్ ఖాతా పూర్తిగా కుక్కలను కలిగి ఉన్న ఇలాంటి సమూహ చిత్రాలతో నిండిపోయింది.