»There Is No Wheelchair The Father Took His Son On The Bike In The Lift Third Floor Kota Govt Hospital Rajasthan
No wheelchair: బైక్ పై కొడుకుని లిఫ్టులో తీసుకెళ్లిన ఫాదర్
ఓ ప్రభుత్వాసుపత్రిలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గాయపడిన తన కొడుకు(son)ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో అక్కడి సిబ్బంది వీల్ ఛైర్ లేదని చెప్పారు. దీంతో ఆవేదన చెందిన ఆ తండ్రి(father) తన కుమారుడిని బైక్ పై మూడో అంతస్తుకు లిఫ్టులో తీసుకెళ్లాడు. ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఓ తండ్రి తన కుమారుడికి గాయమైందని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాడు. కానీ అక్కడి సిబ్బంది సమయానికి వీల్‌ఛైర్(No wheelchair) లేదని చెప్పారు. దీంతో అతన్ని స్కూటర్‌పై ఆస్పత్రిలోని మూడో అంతస్తుకు లిఫ్టులో తీసుకెళ్లాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటా(kota)లో చోటుచేసుకుంది. లాయర్ మనోజ్ జైన్ కుమారుడి కాలికి గాయం కాగా.. చికిత్స నిమిత్తం అతన్ని గురువారం కోటలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ ఆర్థోపెడిక్ వార్డు మాత్రం ఆస్పత్రిలోని మూడో అంతస్తులో ఉంది. తన కొడుకును మూడో అంతస్తుకు తీసుకెళ్లేందుకు వీల్ చైర్ కావాలని ఆస్పత్రి సిబ్బందిని అడిగాడు. అయితే వీల్ చైర్ లేదని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.
అందుకే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుని హాస్పిటల్ లోపలికి వచ్చానని ఆయన పేర్కొన్నారు. కొడుకుని వెనకే కూర్చోబెట్టుకుని లిఫ్ట్ దగ్గరకు చేరుకున్నాడు. స్కూటర్ తో పాటు లిఫ్ట్ ఎక్కి మూడో అంతస్తుకి చేరుకున్నాడు. అక్కడి నుంచి స్కూటర్ నడుపుతూ కొడుకును ఆర్థోపెడిక్ వార్డుకు తీసుకెళ్లాడు. పారామెడికల్ సిబ్బంది తన కుమారుడి కాలికి కట్టు కట్టడంతో మనోజ్ జైన్(father) కొడుకును స్కూటర్‌పై వెనక్కి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది మనోజ్ జైన్‌ను ఆపి స్కూటర్ తాళం తీసుకున్నారు. దీనిపై మనోజ్ జైన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆస్పత్రిలో వీల్ చైర్లు లేకపోవడంతో గాయపడిన కొడుకును సిబ్బంది అనుమతితో స్కూటర్(bike) పై మూడో అంతస్తుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ గొడవ విషయం ఆస్పత్రి ఔట్ పోస్టు వద్ద పోలీసులకు తెలిసింది. వెంటనే మూడో అంతస్తుకు చేరుకున్నారు. న్యాయవాది మనోజ్ జైన్ చేసిన పనిని పోలీసులు కూడా సమర్థించారు. ఆ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరుగగా.. వీల్ చైర్లు అందుబాటులో ఉంచుతామని వైద్యశాఖ అధికారులు హామీ ఇచ్చారు.