రైల్వే టికెట్ బుకింగ్ సేవలు అందించే ఐఆర్సీటీసీ ఆన్లైన్ వెబ్సైట్ పనిచేయడం లేదు. అమెజాన్, మేక్ మై ట్రిప్ తదితర థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.
IRCTC: దేశ రావాణలో రైల్వే వ్యవస్థ(Railway system) ఎంత పెద్దదో అందరికి తెలిసిందే. మరి అలాంటి వ్యవస్థకు అంతరాయం కలగకుండా లక్షాలది మంది సిబ్బంది నిరంతరం పని చేస్తు ఉంటారు. అదే మాదిరి టికెట్లు అందించే వెబ్సైట్లలో కూడా చాలా మంది ఇంజనీర్లు పనిచేస్తుంటారు. ఇదిలా ఉంటే చాలా మంది రైల్వే టికెట్ల కోసం ఐఆర్సీటీసీ ఆన్లైన్ వెబ్సైట్(IRCTC Online Website)పై ఆధారపడుతుంటారు. ప్రస్తుతం ఈ యాప్ తాత్కాలికంగా పనిచేయడం లేదు. సాంకేతిక సమస్యల కారణంగా టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయాయని అధికారులు వెల్లడించారు.
సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు తమ ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారని.. ప్రస్తుతానికి అమెజాన్(Amazon), మేక్ మై ట్రిప్( make my trip) తదితర థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. సమస్య పరిష్కరించిన వెంటనే ట్విట్టర్ ద్వారా తెలియజేస్తామని ఐఆర్ సీటీసీ అధికారులు ట్విట్టర్లో తెలిపారు. దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోవడంతో ఐఆర్ సీటీసీ ట్వీట్ పై ప్రయాణికులు కామెంట్లు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా టికెట్ బుకింగ్ సాధ్యం కావడం లేదని, ఐఆర్ సీటీసీలో ఏర్పడిన సమస్యను త్వరగా సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.