తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఊహించని కానుక పంపారు. ఆమె రాజకీయపరంగానే గిఫ్ట్ పంపింది. ప్రజా సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనతో కలిసి ప్రజా ప్రస్థానం పాదయాత్రకు రావాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు బూట్లు పంపించింది. ప్యాక్ చేసిన బూట్లను ప్రగతిభవన్ కు పంపిస్తున్నట్లు షర్మిల తెలిపారు. అప్పుడైనా ప్రజల కష్టాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
తన ప్రజా ప్రస్థానం పాదయాత్ర పున:ప్రారంభం సందర్భంగా గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడారు. ప్రజల సమస్యలపై సీఎం కేసీఆర్ కు పట్టింపు లేదని ఆరోపించారు. టోపీ పెట్టుకుని విమానాల్లో తిరిగితే ప్రజల కష్టాలు తెలియని ఎద్దేవా చేశారు. తనతో కలిసి ఒక్క రోజు పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. ఒక్క రోజు వస్తే ప్రజల కష్టాలు సీఎం కేసీఆర్ కు తెలుస్తాయని పేర్కొన్నారు. తనతో ఒక్క రోజు పాదయాత్ర రావాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు బూట్లు పంపుతున్నట్లు షర్మిల తెలిపింది. ప్యాక్ చేసిన బూట్లను ప్రగతి భవన్ పంపిస్తున్నట్లు తెలిపారు. వాటిని సీఎం కేసీఆర్ వేసుకుని యాత్రకు రావాలని షర్మిల కోరింది.
#WATCH | YSRTP chief YS Sharmila shows a shoe box and asks Telangana CM KCR to join Padayatra with her and know the public problems. pic.twitter.com/tU8Cxn13jE